News September 14, 2024
ఇక సెలవు.. కామ్రెడ్ ఏచూరి సీతారాం

CPM జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అంతిమయాత్ర ముగిసింది. ఢిల్లీలోని CPM కేంద్ర కార్యాలయం ఏకే గోపాలన్ భవన్ నుంచి ఎయిమ్స్ ఆసుపత్రి వరకు అంతిమయాత్ర సాగింది. అనంతరం ఆయన పార్థివదేహాన్ని ఆసుపత్రికి రీసెర్చ్ కోసం అప్పగించారు. ఇక సెలవంటూ దివికేగిన ఏచూరికి వివిధ దేశాల ప్రతినిధులు, అభిమానులు తుది వీడ్కోలు పలికారు. కడవరకు ప్రజాగొంతుకగా నిలిచిన కామ్రెడ్‌ను తలుచుకొని ‘లాల్ సలాం’ అంటూ నినదించారు.
Similar News
News January 13, 2026
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో పోస్టులు

CSIR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (<
News January 13, 2026
ప్రెగ్నెన్సీలో ఈ లక్షణాలుంటే డేంజర్

ప్రెగ్నెన్సీ సమయంలో రక్తస్రావం ఎక్కువగా, గడ్డలు గడ్డలుగా కావడం, భరించలేని కడుపు/పొత్తి కడుపు నొప్పి, వికారం, అలసట, చలి, జ్వరం.. వంటి లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే వైద్య నిపుణుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిదంటున్నారు. తద్వారా దాని ప్రభావం ఇటు మీపై, అటు కడుపులోని బిడ్డపై పడకుండా ముందే జాగ్రత్తపడచ్చని చెబుతున్నారు.
News January 13, 2026
భోగి పండుగ రోజున పిల్లలు రేగు పళ్లు ఎందుకు తినాలి?

రేగుపండ్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. పిల్లల్లో వచ్చే జలుబు, దగ్గుల నుంచి రక్షణనిస్తాయి. మెదడును ప్రశాంతంగా ఉంచి, చిన్నారులలో ఏకాగ్రతను, చలాకీతనాన్ని పెంపొందిస్తాయి. వీటిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎముకలను దృఢమవుతాయి. రక్తాన్ని శుద్ధి చేసి చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అందుకే భోగి పళ్లు కేవలం సంప్రదాయమే కాదు! పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడే ఆరోగ్య ప్రదాయిని.


