News September 14, 2024
ఆస్పత్రికి ఇచ్చిన మృతదేహాన్ని ఏం చేస్తారంటే..

చాలామంది తమ మరణానంతరం మృతదేహాన్ని ఆస్పత్రులకు అప్పగించాలని కోరుతుంటారు. ఇలా వచ్చిన బాడీలను ఆస్పత్రిలో ఏం చేస్తారన్నది చాలామందిలో ఉండే ప్రశ్న. వాటి ద్వారానే విద్యార్థులకు అవయవాలు కోయడం, సర్జరీ వంటివి నేర్పిస్తారు. ఆస్పత్రిలో మైనస్ 20 డిగ్రీల్లో దేహాన్ని భద్రపరుస్తారు. కొన్ని ఆస్పత్రుల్లో ఫార్మాలిన్ అప్లై చేస్తారు. మృతదేహంపై ప్రయోగాలు పూర్తైతే దాన్ని ఆస్పత్రే ఖననం లేదా దహనం చేస్తుంది.
Similar News
News November 10, 2025
నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న అజహరుద్దీన్

TG: కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గత నెల 31న ప్రభుత్వం ఆయన గవర్నర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అజహరుద్దీన్‌కు ప్రభుత్వం మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలను కేటాయించింది. ఆయనతో కలుపుకొని ప్రస్తుతం క్యాబినెట్ మంత్రుల సంఖ్య 15కు చేరింది. ఇంకా రెండు ఖాళీలు ఉన్నాయి.
News November 10, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 10, సోమవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.04 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.18 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 10, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


