News September 14, 2024

ఖైరతాబాద్ గణేశ్.. నిమజ్జనం ఎన్ని గంటలకంటే?

image

TG: ఈ నెల 17న హైదరాబాద్‌లో నిమజ్జన కార్యక్రమం జరగనుంది. దీని కోసం సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 30వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు HYD కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనాన్ని మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలలోపు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఉదయం 6 గంటలకు గణనాథుడికి పూజలు పూర్తి చేసి నిమజ్జనానికి తరలివెళ్లనున్నట్లు చెప్పారు.

Similar News

News December 21, 2024

నా సహచరులు విధిలేక బీఆర్ఎస్‌లో ఉన్నారు: సీఎం రేవంత్

image

కొంతమంది నేతలు విధిలేక BRSలో కొనసాగుతున్నారని CM రేవంత్ అన్నారు. ‘BRSలోనూ రాష్ట్రం కోసం ఆలోచించే కొంతమంది ఉన్నారు. విధిలేని పరిస్థితుల్లో, రాజకీయ కారణాలతో వేరే దారిలేక ఆ పార్టీలో కొనసాగుతున్నారు. వారు హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. నగరం అభివృద్ధి చెందితే వారి గౌరవం పెరుగుతుంది. ఆ నేతలకు చెబుతున్నా. BRS వారితో సావాసం చేయకండి. వాళ్లు తెలంగాణ సమాజం కోసం పనిచేసే రకాలు కాదు’ అని పేర్కొన్నారు.

News December 21, 2024

విరాట్ కోహ్లీ పబ్‌కు నోటీసులు

image

బెంగళూరులోని టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన ‘వన్8 కమ్యూన్’ పబ్‌కు అధికారులు నోటీసులు ఇచ్చారు. క్లబ్‌లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించనందుకే BBMP (బెంగళూరు బృహత్ మహానగర పాలికే) సమన్లు జారీ చేసింది. ఈ పబ్ చిన్నస్వామి స్టేడియం సమీపంలో ఉన్న రత్నం కాంప్లెక్స్‌లోని ఆరో ఫ్లోర్‌లో ఉంది. దీనిపై గత నెల 29న సామాజిక కార్యకర్త హెచ్.ఎమ్ వెంకటేశ్ ఫిర్యాదు చేయగా నోటీసులు పంపింది.

News December 21, 2024

సినీ స్టార్లపై సీఎం రేవంత్ ఫైర్

image

TG: అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులతో హీరో అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించారని CM రేవంత్ మండిపడ్డారు. బన్నీ బాధ్యతరాహిత్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ‘సంధ్య థియేటర్‌కు హీరో, హీరోయిన్ రావొద్దని చెప్పాం. వారు అక్కడికి వచ్చి తొక్కిసలాటకు కారణమయ్యారు. తల్లి చనిపోయి, కుమారుడు చావు బతుకుల్లో ఉంటే ఒక్క సినీ స్టార్ పరామర్శించలేదు. నటుడిని అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకు?’ అని ఫైర్ అయ్యారు.