News September 14, 2024
ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఉప్పు వదిలేయాలా?

ఉప్పు నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటుందని కొందరి విశ్వాసం. అందుకే దీంతో దిష్టి తీస్తారు. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఉప్పును వదిలేసి వెళితే మనలోని నెగటివ్ ఎనర్జీ పోతుందనీ నమ్ముతుంటారు. అయితే అలా చేయడం సరి కాదని పండితులు చెబుతున్నారు. ఉండటానికి నీడనిచ్చిన వారి ఇంట్లో ఉప్పు వదిలేసి వారికి హాని చేసే ఆలోచన మంచిది కాదంటున్నారు. కావాలంటే ఉప్పును నీళ్లలో వేయాలంటున్నారు. కరిగాక ఎక్కడైనా పోయవచ్చని చెబుతున్నారు.
Similar News
News November 7, 2025
ఆయిల్ పామ్ సాగులో ఇవి కీలకం

ఆయిల్ పామ్ సాగుకు నీటి సదుపాయం కీలకం. 2 అంగుళాల బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా రోజూ 2,3 గంటలు.. వేసవిలో 4,5 గంటలు నీరివ్వాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి నిపుణుల సూచనలతో ఎరువులు తప్పక వేయాలి. పంట దిగుబడికి ఫలదీకరణం కీలకం. అందుకే మొక్క నాటిన ఏడాదిన్నర నుంచి మూడేళ్ల వరకు వచ్చే పొత్తులను తీసేయాలి. దీని వల్ల మొక్క మాను బాగా వృద్ధిచెందుతుంది. భవిష్యత్తులో గెలలు నిండుగా వచ్చి బరువు పెరుగుతాయి.
News November 7, 2025
సరస్వతీ దేవి ఎలా జన్మించింది?

పూర్వం సృష్టి శూన్యంగా ఉండేది. దీంతో బ్రహ్మ దేవుడు లోకాన్ని సృష్టించాలనుకున్నాడు. ఆ కార్యాన్ని ప్రారంభించడానికి అతనికి జ్ఞానం, వాక్కు అవసరమయ్యాయి. అప్పుడు బ్రహ్మ తన మనస్సు నుంచి తేజోమయి సరస్వతీ దేవిని సృష్టించాడు. ఆమె వీణ, పుస్తకం, జపమాల ధరించి, ఆవిర్భవించింది. బ్రహ్మకు వాక్కు, జ్ఞానం అందించింది. ఆమె అనుగ్రహంతోనే బ్రహ్మ వేదాలను, సమస్త విశ్వాన్ని సృష్టించగలిగాడు. అందుకే బ్రహ్మ మానస పుత్రిక అంటారు.
News November 7, 2025
భారీ జీతంతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంలో ఉద్యోగాలు

<


