News September 14, 2024

మెడికల్ షాప్ వారు పోలీస్ శాఖకు సహకరించాలి: SP

image

కడప జిల్లాలో గంజాయి విక్రయాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దాడులు ముమ్మరంగా చేయడంతో గంజాయి వ్యసనానికి అలవాటుపడ్డ యువత, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలలో మత్తు కలిగే మందుల కోసం మెడికల్ షాప్‌లకు వచ్చే అవకాశం ఉందని, ఎట్టి పరిస్థితుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను విక్రయించవద్దని జిల్లా SP హర్షవర్ధన్ రాజు, మెడికల్ షాప్ నిర్వాహకులకు శనివారం సూచించారు.

Similar News

News February 10, 2026

కడప: డిగ్రీ పరీక్షలు రాసేందుకు ఇదే చివరి అవకాశం

image

యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ కళాశాలల విద్యార్థులు పెండింగ్ సబ్జెక్టులను ఒకేసారి రాసుకునే అవకాశాన్ని కల్పించినట్లు సీఈ ప్రొ. కె.ఎస్.వి. కృష్ణారావు తెలిపారు. 2010 నుంచి 2019 సంవత్సరాలలో డిగ్రీ చదివి పాస్ కాని వారికి ఇదే చివరి అవకాశమన్నారు. మార్చి 16వ తేదీ లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు YVU అధికార వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

News February 10, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరులో మంగళవారం బంగారం, వెండి ధరల వివరాలు:
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.15,950
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.14,674
* 10 గ్రాముల వెండి ధర: రూ.2,670.

News February 10, 2026

రేపే అసెంబ్లీ: ఆకేపాటి, సుధ ఎంట్రీ ఇస్తారా..?

image

రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లా YCP MLAలు ఆకేపాటి అమరనాథరెడ్డి, దాసరి సుధ హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో సమావేశాలకు దూరంగా ఉన్న వీరు కీలకమైన బడ్జెట్ సమావేశాల్లోనైనా అడుగుపెడతారా అన్న అంశంపై ఆయా నియోజకవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. సభలో పాల్గొని సమస్యలపై గళమెత్తి నిధులు రాబట్టాలని స్థానికులు కోరుతున్నారు.