News September 14, 2024
MBUపై ఆరోపణలు.. విద్యార్థులకు మంచు మనోజ్ సపోర్ట్

AP: నటుడు మోహన్ బాబుకి చెందిన శ్రీవిద్యానికేతన్, MB యూనివర్సిటీల్లో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని స్టూడెంట్స్, తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న వేళ మంచు మనోజ్ ట్వీట్ చర్చనీయాంశమైంది. ‘ప్రస్తుత పరిస్థితి బాధించింది. ఈ సమయంలో విద్యార్థులకు సపోర్ట్‌గా ఉంటా. నా తండ్రి మోహన్ బాబు విద్యార్థుల శ్రేయస్సుకే ప్రాధాన్యమిస్తారు. ఫిర్యాదులను నా మెయిల్‌కు పంపండి. నా తండ్రి దృష్టికి తీసుకెళ్తా’ అని చెప్పారు.
Similar News
News January 13, 2026
సంక్రాంతి: పంతంగి టోల్ నుంచి 25 వేల వాహనాలు పాస్

చౌటుప్పల్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు తమ సొంత ఊళ్లకు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో పంతంగి టోల్ గేట్ గుండా మంగళవారం అర్ధరాత్రి నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు సుమారు 25 వేల వాహనాలు వెళ్లినట్లు టోల్ గేట్ అధికారులు తెలిపారు. వాహనాల రాకపోకలు సజావుగా కొనసాగాయని పేర్కొన్నారు.సాయంత్రం వరకు వాహనాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
News January 13, 2026
ఆభరణాలు నల్లగా మారాయా? ఇలా చేయండి

☛ఒక గిన్నెలో డిష్‌వాష్ లిక్విడ్ వేసి అందులో నగలు నాననివ్వాలి. తర్వాత మెత్తని బ్రష్‌తో తోమి శుభ్రం చేస్తే మునుపటి రూపు సంతరించుకుంటాయి.
☛ డిటర్జెంట్ పౌడర్, ఒక చెక్క నిమ్మరసం వేడి నీటిలో కలిపి ఆభరణాలను వేసి 5నిమిషాలు ఉంచాలి.
☛బంగారు గాజులను నీటిలో నానబెట్టి రెండు చెంచాల శనగపిండిలో తగినంత వెనిగర్ కలిపి, మెత్తని పేస్టులా చేసి గాజులకు పట్టించాలి. తర్వాత బ్రష్‌తో రుద్ది కడిగితే కొత్తవాటిలా మెరుస్తాయి.
News January 13, 2026
10 నిమిషాల ఆన్‌లైన్ డెలివరీ బంద్

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్‌లైన్ డెలివరీ విధానాన్ని ఎత్తివేస్తూ కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదేశాలు జారీ చేశారు. అందుకు సంబంధించిన యాడ్స్ ఇవ్వకూడదంటూ బ్లింకిట్ సహా అన్ని క్విక్ కామర్స్ సంస్థలకు సూచించారు. కాగా 10 ని. నిబంధనను ఎత్తివేయాలంటూ కొత్త ఏడాదికి ముందు గిగ్ వర్కర్లు నిరసన చేపట్టారు. దీంతో సంస్థలకు కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.


