News September 15, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.2,90,723 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,71,772, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.57,700, అన్నదానం రూ.61,251 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
Similar News
News January 12, 2026
కరీంనగర్ జిల్లాలో 765 యాక్సిడెంట్స్, 180 మరణాలు

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా సోమవారం చొప్పదండిలో కరీంనగర్ డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన జిల్లాలో 2025లో 765 రోడ్డు ప్రమాదాలు జరిగి 180 మృతి చెందినట్లు తెలిపారు. చొప్పదండిలోనే 31 యాక్సిడెంట్స్ జరిగాయన్నారు. ఓవర్ లోడ్, మద్యం సేవించి డ్రైవ్ చేయడం, మొబైల్ డ్రైవింగ్ వంటివి ప్రమాదాలకు కారణాలని తెలిపారు. రోడ్ సేఫ్టీ కోఆర్డినేటర్ నీలం సంపత్ పాల్గొన్నారు.
News January 11, 2026
హుజూరాబాద్: లాడ్జీలో యువకుడి ఆత్మహత్య

హుజూరాబాద్‌లోని వైస్రాయ్ లాడ్జీలో వడ్లకొండ చిరంజీవి(30) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం మందలోరిపల్లికి చెందిన చిరంజీవి, 2 రోజుల క్రితం లాడ్జీలో గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆదివారం ఉదయం నుంచి అతను ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు సాయంత్రం లాడ్జీకి చేరుకొని, గది కిటికీలో నుంచి చూడగా చిరంజీవి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు.
News January 11, 2026
KNR: కంటైనర్ బోల్తా.. రైతు స్పాట్‌డెడ్

శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులో జరిగిన ఘోర ప్రమాదంలో స్థానిక రైతు రాణవేని హనుమంతు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ నుంచి పేపర్ లోడుతో వెళ్తున్న కంటైనర్, అండర్ ఫ్లైఓవర్ సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. రోడ్డు విస్తరణ పనుల వద్ద ఈ ప్రమాదం జరగగా, అండర్ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్న హనుమంతుపై కంటైనర్ పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.


