News September 15, 2024
గణేష్ నిమజ్జనం సజావుగా సాగేలా చర్యలు తీసుకోండి- ఎస్పీ

వినాయక ఉత్సవాల్లో ఆఖరు ఘట్టమైన గణేష్ నిమజ్జనం జిల్లా కేంద్రంలో సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం జరిగే గణేష్ నిమజ్జనం నేపథ్యంలో గణేష్ నిమజ్జనం ఘాట్‌లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వినాయక ప్రతిమల ఊరేగింపు మొదలు నిమజ్జనం పూర్తి అయ్యేవరకు, ఉత్సవ కమిటీలు అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Similar News
News January 20, 2026
మద్దికెర, చిప్పగిరి మండలాలకు అభివృద్ధి నిధులు

నీతి ఆయోగ్ యాస్పిరేషనల్ బ్లాక్‌గా ఎంపికైన మద్దికెర మండలంలో రూ.కోటి అభివృద్ధి పనులకు ఆమోదం లభించిందని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. అంగన్వాడీలు, హెల్త్ క్లినిక్‌లు, ఆర్వో ప్లాంట్లు, మినీ ట్యాంకుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు. చిప్పగిరి మండలంలో రూ.1.50 కోట్ల పనులకు అనుమతులు వచ్చాయని చెప్పారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News January 20, 2026
ఎమ్మిగనూరు: విషాదం.. తల్లీకూతురి మృతి

తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా ముసాపేట(M) జానంపేట సమీపంలోని NH-44పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మిగనూరుకు చెందిన తల్లీకూతురు రాధ (42), లక్ష్మీదుర్గ (8) అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని ఆటో, బొలెరో వాహనాలు ఢీకొట్టి అనంతరం అవతలి రోడ్డుపై ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News January 20, 2026
ఫిబ్రవరి 10లోగా ‘ఈ-క్రాప్’ పూర్తి చేయాలి: కర్నూలు కలెక్టర్

ఫిబ్రవరి 10వ తేదీ నాటికి జిల్లాలో ఈ-క్రాప్ బుకింగ్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి ఈ-పంట బుకింగ్, రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో పురోగతి సాధించాలని, పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


