News September 15, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News January 13, 2026

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఉద్యోగాలు

image

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (<>AIIA<<>>)లో 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టును బట్టి BAMS, BSc(లైఫ్ సైన్స్), టెన్త్, ఎనిమిదో తరగతి అర్హతతో పాటు పనిఅనుభవం గల వారు జనవరి 16న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు నెలకు రూ.50వేలు, మాలికి రూ.21,215, లేబర్‌కు రూ.17,494 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://aiia.gov.in

News January 13, 2026

రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన స్కిల్ కేసు!

image

AP: స్కిల్ <<18842559>>కేసులో<<>> CBN అరెస్ట్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. 2024లో TDP నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడానికి ఈ కేసు కారణమైంది. CBN జైల్లో ఉన్న సమయంలో రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు జరిగాయి. లోకేశ్, భువనేశ్వరి, బ్రహ్మణి రోడ్లపై నిరసనలకు దిగారు. పవన్ కళ్యాణ్ జైల్లో ఆయనను పరామర్శించి TDPతో పొత్తును ప్రకటించారు. BJP కూడా కలిసిరావడంతో 2024లో కూటమి ఘనవిజయం సాధించింది. వైసీపీ ఘోర పరాభవం ఎదుర్కొంది.

News January 13, 2026

పిండివంటల కోసం ఈ చిట్కాలు

image

* పిండి వంటలు చేసేటపుడు నూనె పొంగకుండా ఉండాలంటే మరుగుతున్న నూనెలో తమలపాకు వేసి, అది రంగు మారాక తీస్తే సమస్య ఉండదు.
* వంటకాలు తక్కువ నూనెను పీల్చుకోవాలంటే మూకుడులో కాస్త వెనిగర్ వేయండి.
* వంటగది గట్టు మీద జిడ్డు పోవాలంటే కాస్త వంటసోడా చల్లి పీచుతో రుద్ది కడిగితే శుభ్రపడుతుంది.
*వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలు వేస్తే మంచి వాసన వస్తుంది.