News September 15, 2024

ప్రజలకు షాక్.. భారీగా పెరిగిన వంట నూనెల ధరలు

image

వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 20% <<14099025>>పెంచడంతో<<>> వినియోగదారులపై భారం పడుతోంది. అన్ని రకాల ఆయిల్స్‌ ధరలు లీటర్‌పై ఒక్కసారిగా రూ.15-20 పెరిగాయి. పామాయిల్ ₹100 నుంచి ₹115, సన్ ఫ్లవర్ ఆయిల్ ₹115 నుంచి ₹130-140, వేరు శనగ నూనె రూ.155 నుంచి రూ.165కు చేరింది. పూజలకు ఉపయోగించే నూనెలనూ ₹110 నుంచి ₹120కి పెంచి వ్యాపారులు అమ్ముతున్నారు.

Similar News

News September 16, 2025

వక్ఫ్ చట్టంపై SC ఉత్తర్వులను స్వాగతించిన KTR

image

TG: వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర <<17717100>>ఉత్తర్వులను<<>> మాజీ మంత్రి KTR స్వాగతించారు. ఈ చట్టంలోని వివాదాస్పద నిబంధనలను BRS మొదటి నుంచి వ్యతిరేకిస్తోందన్నారు. ‘చట్టంలోని సమస్యలపై మేం పోరాడాం. ఒక వ్యక్తి ముస్లిం అని ఎవరు నిర్ణయిస్తారు? ప్రభుత్వ అధికారి ఏకపక్షంగా వక్ఫ్ ఆస్తుల యాజమాన్యాన్ని ఎలా నిర్ణయిస్తారు? ఇలాంటి అనేక సమస్యలు ఈ చట్టంలో ఉన్నాయి. ఇవి విభజన రాజకీయాలకు ఆజ్యం పోయగలవు’ అని ఆయన అన్నారు.

News September 16, 2025

డ్వాక్రా సంఘాలు మరింత ఎత్తుకు ఎదగాలి: CBN

image

AP: మహిళా సాధికారత కోసం తీసుకువచ్చిన డ్వాక్రా సంఘాలు మరింత ఎత్తుకు ఎదగాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘కోటీ 20 లక్షల మంది అతిపెద్ద మహిళా సైన్యం డ్వాక్రా సంఘాల రూపంలో రాష్ట్రానికి ఉంది. నేను ప్రారంభించిన ఈ సంఘాలను ఎవరూ ఏం చేయలేకపోయారు. మహిళా సంఘాలకు రుణం ఇస్తే డబ్బులు బ్యాంకులో ఉన్నట్టే. డ్వాక్రా సంఘాల టర్నోవర్ రూ.10 లక్షల కోట్లకు ఎదగాలని ఆశిస్తున్నా’ అని తెలిపారు.

News September 16, 2025

రానున్న 2-3 గంటల్లో వర్షం.. భారీగా ఈదురు గాలులు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, కరీంనగర్, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షం కురవొచ్చని అంచనా వేసింది. గంటకు 41-61కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.