News September 15, 2024

త్వరలోనే ఖాతాల్లోకి రూ.10,000: మంత్రి పొంగులేటి

image

TG: ప్రకృతి విపత్తుల సమయంలో కేంద్ర సాయం కోసం ఎదురుచూడకుండా రాష్ట్రస్థాయిలో ప్రత్యేక బృందాల ఏర్పాటుకు యోచిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి పోలీస్ బెటాలియన్ నుంచి 100 మందికి విపత్తు నిర్వహణలో శిక్షణ ఇస్తామన్నారు. వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన వారి ఖాతాల్లో ఎకరాకు ₹10,000 చొప్పున త్వరలోనే జమ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ₹10వేల కోట్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు.

Similar News

News November 5, 2025

ఉపరితల ఆవర్తనంతో ఈ జిల్లాల్లో వర్షాలు!

image

కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ APలోని కోనసీమ, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, NLR, కర్నూలు, కడప, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు TGలో ఇవాళ్టితో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో వర్షాలు ముగుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

News November 5, 2025

నేడు తులసి పూజ ఎందుకు చేయాలి?

image

కార్తీక పౌర్ణమి రోజునే తులసీ మాత భూమిపైకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు తప్పకుండా తులసికి గంగాజలంతో పూజ చేయాలంటారు పండితులు. ఫలితంగా భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. తులసి కోట వద్ద దీపారాధన చేసి, దీపదానం చేస్తే.. లక్ష్మీ దేవి సంతోషించి, కటాక్షాన్ని ప్రసాదిస్తుందట. అంతేకాక, పసుపు పూసిన నాణాన్ని ఎరుపు వస్త్రంలో ఉంచడం వలన కుటుంబంలో సంపదలు పెరిగి, అందరూ ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం.

News November 5, 2025

అనూరాధ కార్తెలో అనాథ కర్రయినా ఈనుతుంది

image

అనూరాధ కార్తె(నవంబర్) సమయంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఈ కాలంలోని అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా వర్షాలు, వ్యవసాయానికి ఎంతగానో తోడ్పడతాయి. సాధారణంగా ఫలవంతం కాని లేదా పనికిరాని మొక్క (కర్ర) కూడా ఈ కార్తెలో విపరీతమైన దిగుబడిని ఇస్తుందని.. ఈ సమయంలో రైతులు మంచి పంట దిగుబడిని ఆశించవచ్చనే విషయాన్ని ఈ సామెత నొక్కి చెబుతుంది.