News September 15, 2024
నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లనున్నారు. మ.12 గంటలకు చిన్నచింతకుంట మండలంలో పర్యటిస్తారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి దశదినకర్మకు హాజరుకానున్నారు. అనంతరం మ.2.45కు గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్గా మహేశ్ గౌడ్ బాధ్యతలు తీసుకునే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఇందిరా భవన్ ముందు నిర్వహించే సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Similar News
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.
News September 18, 2025
విధ్వంసం.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ

ఇంటర్నేషనల్ టీ20ల్లో నమీబియా ఓపెనర్ ఫ్రైలింక్ విధ్వంసం సృష్టించారు. జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో కేవలం 13 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు మొత్తం 31 బంతుల్లో 77 రన్స్ చేసి ఔట్ అయ్యారు. 6 సిక్సర్లు, 8 ఫోర్లు బాదారు. ఫ్రైలింక్ బాదుడుతో నమీబియా 20 ఓవర్లలో 204/7 రన్స్ చేసింది. ఛేజింగ్లో జింబాబ్వే ఎదురొడ్డుతోంది.