News September 15, 2024
7 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం

TG: రాష్ట్ర సాధారణ వర్షపాతం 738mm కాగా ఈ వానాకాలం సీజన్‌లో ఈ నెల 11 నాటికి 897mm నమోదైనట్లు వాతావరణ అధికారులు తెలిపారు. సిద్దిపేట, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల్లో అత్యధిక వర్షాలు కురిశాయన్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా, మిగిలిన 24 జిల్లాల్లో అధిక వర్షాలు పడ్డాయని వెల్లడించారు.
Similar News
News January 16, 2026
162 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల

NABARD 162 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థుల నుంచి జనవరి 17నుంచి ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తు స్వీకరించనుంది. వయసు 21 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.32,000 చెల్లిస్తారు. పూర్తి స్థాయి నోటిఫికేషన్ రేపు విడుదల చేయనున్నారు. వెబ్‌సైట్: https://www.nabard.org
News January 16, 2026
బంగ్లాను దారికి తెచ్చేందుకు జైషా ‘డైరెక్ట్ అటాక్’!

T20 వరల్డ్ కప్ విషయంలో మొండికేస్తున్న బంగ్లా బోర్డును దారికి తెచ్చుకునేందుకు ICC కీలక అడుగు వేయనుంది. ఈ వివాదానికి ఎండ్ కార్డ్ వేసేలా ICC ప్రతినిధుల బృందం త్వరలో బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన వర్చువల్ మీటింగ్‌లో ‘మేం ఇండియాకు రాబోం’ అని బంగ్లా చెప్పినట్లు తెలుస్తోంది. చివరి యత్నంగా ఈ ‘వన్ టు వన్’ మీటింగ్ నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాలని ICC డిసైడైనట్లు అర్థమవుతోంది.
News January 16, 2026
వంటింటి చిట్కాలు

* కప్పు వెనిగర్ లో టేబుల్ స్పూను ఉప్పు కలిపి వేడిచేయాలి. ఈ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే రాగి పాత్రలకు పట్టించి చల్లారాక శుభ్రపరిస్తే సరి. కొత్తవాటిలా మెరుస్తాయి. * నిల్వ ఉంచిన మష్రూమ్స్ తాజాగా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించేందుకు వాటిని వెల్లుల్లితో కలిపి ఉడికించండి. రంగు మారితే అవి పాడయినట్లు అర్థం. * డైనింగ్ టేబుల్ మీద ఈగలు వాలుతుంటే ఉప్పు నీళ్ళలో తడిపిన వస్త్రంతో తుడిస్తే దరిచేరవు.


