News September 15, 2024

APPLY NOW.. 39,481 ప్రభుత్వ ఉద్యోగాలు

image

BSF, CISF, CRPF, SSB, SSF, ITBP, అస్సాం రైఫిల్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో 39,481 GD కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. OCT 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ పాసైన 18-23 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. నవంబర్ 5-7 వరకు దరఖాస్తుల్లో మార్పులు చేసుకోవచ్చు. 2025 జనవరి, ఫిబ్రవరి మధ్య పరీక్షలు జరుగుతాయి. వివరాలకు https://ssc.gov.in/loginను చూడండి.

Similar News

News July 5, 2025

భారత్ డిక్లేర్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 427/6 వద్ద ఉన్నప్పుడు కెప్టెన్ గిల్ డిక్లేర్ ప్రకటించారు. ప్రస్తుతం భారత్ 607 పరుగుల ఆధిక్యంలో ఉంది. గిల్ (161), రాహుల్ (55), పంత్ (65) జడేజా (69*) రాణించడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. మరికాసేపట్లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించనుంది.

News July 5, 2025

DECLARE ఇవ్వరా? కెప్టెన్ మదిలో ఏముంది?

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా ఆధిక్యం 565 పరుగులు దాటింది. కానీ భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంకా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు. రేపు ఒక రోజు మాత్రమే ఉండటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేట్‌గా డిక్లేర్ ఇస్తే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఉందని చర్చించుకుంటున్నారు. భారత్ మరీ ఆత్మరక్షణ ధోరణి కనబరుస్తోందని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News July 5, 2025

సింగరేణి 136 ఏళ్ల చరిత్రలో తొలిసారి..

image

TG: 136 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థలో కొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారిగా ఇందులో మహిళా రెస్క్యూ టీమ్ ఏర్పాటైంది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. విపత్తు సమయంలో ధైర్యంగా, నైపుణ్యంతో సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ బృందానికి అభినందనలు తెలిపారు.