News September 15, 2024

టీమ్‌ఇండియాతో ఆడటం కష్టం.. కానీ: హెడ్

image

టీమ్‌ఇండియాతో మ్యాచుల్లో మంచి స్కోర్లు చేయడంపై ఆస్ట్రేలియా బ్యాటర్ హెడ్ స్పందించారు. ‘IND బలమైన జట్టు. వారితో ఆడటం కష్టమే. కానీ మేము ఇప్పటికే వారితో చాలా మ్యాచుల్లో తలపడ్డాం. గత రెండేళ్లుగా నేను మంచి ఫామ్‌లో ఉన్నాను. రాణిస్తుండటం బాగుంది. రాబోయే సిరీస్‌లోనూ నా టీమ్‌కు విజయాలు అందించాలని అనుకుంటున్నా’ అని చెప్పారు. 2023 WTC, ODI WC ఫైనల్స్‌లో INDపై AUS గెలుపులో హెడ్ కీలక పాత్ర పోషించారు.

Similar News

News July 4, 2025

నటి రన్యా రావుకు చెందిన రూ.34 కోట్ల ఆస్తులు అటాచ్

image

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యా రావుకు సంబంధించిన రూ.34 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రన్యా రావును బంగారం అక్రమ రవాణా, హవాలా నగదు బదిలీల కేసులో DRI అధికారులు ఈ ఏడాది మార్చి 5న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో బంగారం కొని భారత్‌కు తరలిస్తుండగా బెంగళూరులో అధికారులు పట్టుకున్నారు. అప్పటి నుంచి ఆమె జైలులోనే ఉన్నారు.

News July 4, 2025

సెప్టెంబర్‌లో స్కిల్ పోర్టల్ ప్రారంభం: మంత్రి లోకేశ్

image

AP: స్కిల్ పోర్టల్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించారు. ‘ఉద్యోగ, ఉపాధి కల్పనకు మిషన్ మోడ్ విధానంలో స్కిల్ పోర్టల్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తాం. 90 రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఆటోమేటిక్‌గా రెజ్యూమ్ రెడీ అవుతుంది’ అని Xలో పోస్ట్ చేశారు.

News July 4, 2025

కాసేపట్లో మోస్తరు నుంచి భారీ వర్షం: వాతావరణ కేంద్రం

image

TG: కాసేపట్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. హైదరాబాద్ నగరంలో రాత్రి 9 గంటల తర్వాత అరగంట పాటు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఆదిలాబాద్, గద్వాల, ఆసిఫాబాద్, MBNR, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి వర్షం వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.