News September 15, 2024

SHOCKING: అఫ్గానిస్థాన్‌లో క్రికెట్ నిషేధం?

image

అఫ్గానిస్థాన్‌లో క్రికెట్‌ను క్రమంగా నిషేధించాలని ఆ దేశ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. షరియా చట్టానికి క్రికెట్ హాని కలిగిస్తోందని తాలిబన్ సుప్రీం లీడర్ హిబతుల్లా భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. షరియాను మరింత కఠినంగా అమలు చేయాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. బలమైన జట్టుగా ఎదుగుతున్న అఫ్గాన్‌కు ఇది శరాఘాతమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Similar News

News September 19, 2024

అశ్విన్ ఫైటింగ్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్

image

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 339/6 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (102) సెంచరీతో చెలరేగారు. రవీంద్ర జడేజా (86) సహకారంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (56) అర్ధ సెంచరీతో రాణించారు. బంగ్లా బౌలర్లలో హసన్ మొహమూద్ 4, రానా, మిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.

News September 19, 2024

కొత్త స్టడీ: రోజూ 3 కప్పుల కాఫీతో లాభాలు

image

ప్రతిరోజూ మూడు కప్పుల కాఫీ/టీ తాగడం వల్ల గుండె, జీవక్రియ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని తాజా అధ్యయ‌నం సూచిస్తోంది. చైనాలోని సూచౌ యూనివ‌ర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెస‌ర్‌ చౌఫు కే బృందం 1.80 ల‌క్ష‌ల మందిపై అధ్య‌య‌నం జరిపింది. మితంగా తీసుకొనే కెఫిన్ (3 కప్పుల కాఫీ/టీ) కార్డియోమెటబోలిక్ మల్టీమోర్బిడిటీ, కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ నియంత్ర‌ణ‌లో సాయ‌ప‌డుతుందని వెల్ల‌డించింది.

News September 19, 2024

INDvBAN: అశ్విన్ సూపర్ సెంచరీ

image

బంగ్లాదేశ్‌తో తన హోమ్ గ్రౌండ్‌లో జరుగుతున్న టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా ఆడుతున్నారు. కీలక ఆటగాళ్లు ఔటైన టైమ్‌లో 108 బంతుల్లో సెంచరీ చేసి జట్టును ఆదుకున్నారు. ఇది ఆయనకు 6వ సెంచరీ కావడం విశేషం. అశ్విన్‌కు తోడుగా ఉన్న మరో ఆల్‌రౌండర్ జడేజా సైతం సెంచరీని(79) సమీపిస్తున్నారు. వీరిద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరి కౌంటర్ ఎటాక్‌కు బంగ్లా బౌలర్ల వద్ద సమాధానం కరవైంది.