News September 15, 2024
విశాఖ: ఆ రైలు 5 గంటల ఆలస్యం

సంత్రాగచ్చి-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు(07222) ఈరోజు 5 గంటల ఆలస్యంగా ప్రారంభం కానుంది. సంత్రాగచ్చి నుంచి 12:20 గంటలకు బయల్దేరాల్సి ఉండగా.. ఇవాళ సాయంత్రం 05:20 గంటలకు అక్కడ రైలు కదులుతుంది. ఈ ట్రైన్ దువ్వాడ స్టేషన్‌కు సోమవారం ఉదయం 8:20 గంటలకు చేరుతుంది. లింక్ రైలు ఆలస్యంగా నడుస్తున్నందున ఈ అసౌకర్యం కలిగినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
Similar News
News December 28, 2025
భీమిలికి పెరుగుతున్న వలసలు

భీమిలిలో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని ప్రభుత్వం చెబుతుంటే.. వలస పక్షులు వాలుతున్నాయి. ఇంతకాలం పిల్లల చదువుల కోసం స్టీల్ సిటీకి వచ్చేవారు. ఇప్పుడు ఉపాధి పెరుగుతుండడంతో వలసలు మొదలయ్యాయి. ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, ఐటీ పురోగతి పెరగడంతో మైగ్రేషన్ పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో మొదటి రెండు స్థానాల్లో భీమిలి, గాజువాక నిలిచాయి.
News December 28, 2025
విశాఖలో వ్యభిచార గృహంపై దాడి

విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధి జ్యోతి నగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం సాయంత్రం దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు విటులు జ్యోతిష్, హర్షిత్‌ని అరెస్ట్ చేసి ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసి విటులను, నిర్వాహకురాలిని రిమాండ్‌కి తరలించారు.
News December 28, 2025
విశాఖ సీపీకి డీజీగా పదోన్నతి

విశాఖ సీపీగా విధులు నిర్వహిస్తున్న శంఖబ్రత బాగ్చీకి డీజీగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ కార్యదర్శి కే.విజయానంద్ శనివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. 1996 బ్యాచ్‌కి చెందిన శంఖబ్రత బాగ్చీ పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం విశాఖలో సీపీగా సేవలందిస్తున్నారు. కమిషనర్ రాకతో పోలీసుల సంక్షేమానికి, అభివృద్ధికి, ప్రజోపకార పనులు చేశారు.


