News September 15, 2024

పార్వతీపురంలో వందే భారత్ హాల్ట్‌కు అరకు ఎంపీ ప్రత్యేక చొరవ

image

పార్వతీపురంలో వందే భారత్ హాల్ట్ కోసం అరకు MP చెట్టి తనూజా రాణి ప్రత్యేక చొరవ చూపారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు రెండు రోజుల క్రితం మర్యదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో పార్వతీపురంలో వందే భారత్‌కు హాల్ట్ కల్పించాలని కోరుతూ వినితిపత్రం అందజేశారు. ఆమె ప్రతిపాదనల మేరకు రైల్వే మంత్రి DRM కార్యాలయానికి ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా పార్వతీపురం ప్రజలు అరకు MPకి ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Similar News

News January 3, 2026

రేపే భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్

image

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి గగన విహార ముహూర్తం ఖరారైంది. ఆదివారం ట్రయల్ రన్‌గా ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా తొలి విమానం భోగాపురంలో ల్యాండ్ కానుంది. ఆ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రానున్నారు. ట్రయల్ రన్ విజయవంతమైతే మే నెల నుంచే సాధారణ విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టనున్నారు.

News January 3, 2026

బొండపల్లిలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

image

బొండపల్లి మండలం, మరువాడ గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం పాల్గొన్నారు. రైతుల భూ హక్కులు స్పష్టంగా నమోదై, భవిష్యత్‌లో ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఉండేలా ఈ విధానం రూపకల్పన చేశామన్నారు. క్యూ ఆర్ కోడ్ కలిగిన ఆధునిక పాస్ పుస్తకాలు ప్రభుత్వ రాజముద్రతో అందిస్తున్నామని చెప్పారు.కార్యక్రమంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పాల్గొన్నారు.

News January 3, 2026

VZM: కేజీబీవీ నోటిఫికేషన్.. జిల్లాలో ఖాళీల వివరాలు

image

AP KGBV ఔట్‌సోర్సింగ్‌లో 1095 పోస్టులకు <>నోటిఫికేషన్‌<<>> విడుదల చేసింది. ఇందులో విజయనగరం (D)కు టైప్-3లో వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్-10, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్-12, ANM-7, అటెండెర్-3, హెడ్ కుక్-1, ASST కుక్-2, వాచ్ ఉమెన్-1 ఉండగా.. టైప్-4లో వార్డెన్-4, పార్ట్ టైమ్ టీచర్-7, చౌకిదార్-5, హెడ్ కుక్-3 ASST కుక్-8 ఉన్నాయి. 18 ఏళ్లు పైబడిన మహిళలు మాత్రమే అర్హులు. ఈనెల 11లోపు APC ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలి.