News September 15, 2024
గణేశ్ నిమజ్జనం.. మెట్రో రైళ్ల సమయం పెంపు

TG: ఎల్లుండి ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో మెట్రో రైలు సేవలను అధికారులు పొడిగించారు. ఈ నెల 17న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. చివరి స్టేషన్ నుంచి రాత్రి ఒంటిగంటకు మెట్రో రైలు బయల్దేరుతుందన్నారు. మరోవైపు అవసరాన్ని బట్టి నిమజ్జనం ముగిసే వరకు అదనపు రైళ్లు నడిపిస్తామని అధికారులు తెలిపారు.
Similar News
News February 17, 2026
650 ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

RBIలో 650 అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. మార్చి 8 వరకు <
News February 17, 2026
బాడీ స్ప్రే ఎక్కువగా వాడుతున్నారా?

చెమట నుంచి వచ్చే దుర్వాసనను తప్పించుకునేందుకు కొందరు, మంచి సువాసన కోసం మరికొందరు బాడీ స్ప్రేలు వాడుతుంటారు. అయితే వీటిని ఎక్కువగా వాడటం వల్ల పలు సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే ప్రొపిలిన్ గ్లైకాల్ అనే రసాయనం వల్ల దీర్ఘకాలంలో కాంటాక్ట్ డెర్మటైటీస్, హైపర్ పిగ్మెంటేషన్, గ్రాన్యూలోనూ వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్, పారాబెన్ లేని వాటిని వాడాలని సూచిస్తున్నారు.
News February 17, 2026
వేరుశనగలో తెగుళ్ల కట్టడికి మరికొన్ని సూచనలు

వేరుశనగలో పంట చుట్టూ లేదా పంటలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. కంచె పంటగా సజ్జ లేదా జొన్నలను 3-4 వరుసలలో వేసుకోవాలి. వేరుశనగ పంటలో పసుపు, నీలం జిరుగు అట్టలను ఎకరాకు 10 నుంచి 15 చొప్పున పొలంలో అమర్చుకోవాలి. వేరుశనగ పంటలు ఊడలు దిగే సమయంలో ఎకరానికి 200 కిలోల జిప్సం ఎరువును వేసుకోవాలి. ఈ జాగ్రత్తలతో ఆకుమచ్చ తెగులుతో పాటు ఇతర చీడపీడల ఉద్ధృతిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.


