News September 15, 2024

చంద్రబాబు గారూ.. ఇకనైనా కళ్లు తెరవండి: జగన్

image

AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసే ఆలోచనను ప్రభుత్వం చేస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ‘పులివెందుల కాలేజీకి NMC 50 సీట్లిస్తే వద్దని లేఖ రాయడమేంటి? పక్క రాష్ట్రాలు మెడికల్ సీట్ల కోసం ప్రదక్షిణాలు చేస్తుంటే APకి వచ్చిన సీట్లను తిప్పి పంపడం ఏంటి? కరోనా సమయంలో ప్రజల్ని కాపాడింది ప్రజారోగ్య రంగమే. ఇకనైనా కళ్లు తెరవండి చంద్రబాబుగారు. పేదలకు ఉచిత వైద్య విద్య, వైద్యం అందించండి’ అని ఫైర్ అయ్యారు.

Similar News

News January 10, 2025

అమరావతిలో అభివృద్ధి పనులకు టెండర్ల ఆహ్వానం

image

AP: రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులకు CRDA టెండర్లు ఆహ్వానించింది. రాజధానిలో రూ.2,816 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపింది. బిడ్ల దాఖలుకు ఈ నెల 31 సాయంత్రం 4 గంటల వరకు గడువు ఉన్నట్లు పేర్కొంది. గ్రావిటీ కాలువ పనులు, కొండవీటి వాగు పనులు, కృష్ణాయపాలెం, శాఖమూరులో రిజర్వాయర్, వివిధ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు వివరించింది.

News January 10, 2025

విశాల్ త్వరలోనే కోలుకుంటారు: జయం రవి

image

హీరో విశాల్ అనారోగ్యంపై నటుడు జయం రవి స్పందించారు. కష్టాలను అధిగమించి ఆయన త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారన్నారు. ‘విశాల్ చాలా ధైర్యవంతుడు. మంచి మనసున్న వ్యక్తి. ఎంతో మందికి సేవ చేశారు. ప్రస్తుతం గడ్డు కాలం ఎదుర్కొంటున్నారు. త్వరలోనే సింహం మాదిరి గర్జిస్తారు’ అని పేర్కొన్నారు. <<15094492>>‘మదగజరాజు’<<>> ఈవెంట్‌లో విశాల్ వణుకుతూ మాట్లాడటం అభిమానులను ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే.

News January 10, 2025

ఇన్ఫోసిస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

image

AP: ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఇన్ఫోసిస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఇన్ఫోసిస్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ ఎంవోయూ కుదుర్చుకున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే స్కిల్ సెన్సస్ ప్రి-వాలిడేషన్ కోసం ఈ ఒప్పందం జరిగింది. జనరేట్ ఏఐని ఉపయోగించేలా ఫ్లాట్‌పామ్ ఏర్పాటు చేస్తారు. వచ్చే ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ఈ ఒప్పందం లక్ష్యం.