News September 15, 2024
18న నరసరావుపేటలో జాబ్ మేళా

జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 18న నరసరావుపేటలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాల మేరకు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని 1500 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు.
Similar News
News July 8, 2025
గుంటూరు జిల్లాలో ఆపరేషన్ సేవ్ క్యాంపస్ జోన్

మత్తుపదార్థాల రహిత విద్యా వాతావరణం కోసం గుంటూరు జిల్లాలో “ఆపరేషన్ సేవ్ క్యాంపస్ జోన్” స్పెషల్ డ్రైవ్ మంగళవారం ప్రారంభమైంది. ఎస్పీ సతీశ్ కుమార్ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీల సమీపంలో ఉన్న షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మత్తు పదార్థాల విక్రయంపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. సిగరెట్లు, గంజాయి విక్రయాలపై నిఘా కొనసాగుతుందని తెలిపారు.
News July 8, 2025
GNT: ‘మాజీ ఎంపీ అనుచరుడి నుంచి ప్రాణరక్షణ కల్పించండి’

లాలాపేటకు చెందిన ముజబుర్ రహమాన్, తన సోదరుడికి ప్రాణరక్షణ కల్పించాలని కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరుడు సన్నీ, ఇసుక క్వారీ నిర్వహణకు రూ.25 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా బీహార్ గ్యాంగ్‌తో చంపిస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయమై తన సోదరుడు గతంలో ఆత్మహత్యాయత్నం చేశారని పేర్కొన్నారు.
News July 8, 2025
గుంటూరులో కూరగాయల ధరలు రెట్టింపు

గుంటూరు మార్కెట్లలో టమాటా, పచ్చిమిరప, వంకాయ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. పచ్చిమిరప కిలో రూ.80కి చేరగా, టమాటా రూ.40, వంకాయ రూ.60 పలుకుతోంది. ములక్కాయ ఒక్కటి రూ.15 నుంచి రూ.20కి పెరగడం వినియోగదారులను కుదిపేస్తోంది. డిమాండ్‌తో పోల్చితే సరఫరా తక్కువగా ఉండటం వల్లే ఈ ధరల పెరుగుదల అని వ్యాపారులు తెలిపారు. రైతుబజార్లలో కూడా ఇదే స్థితి కొనసాగుతోంది.