News September 15, 2024
100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేశారా?: హరీశ్
TG: కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేసిందా అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. పింఛన్లు పెంపు, 2 లక్షల ఉద్యోగాలు, రుణమాఫీ అసంపూర్తిగా చేశారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలపై విమర్శలు మాని ప్రజల ఇబ్బందులను తొలగించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. సీఎం రేవంత్ అబద్ధాల వరద పారిస్తున్నారని మండిపడ్డారు. వానాకాలం రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వలేదని విమర్శించారు.
Similar News
News December 21, 2024
పాత కార్లపై జీఎస్టీ 18శాతానికి పెంపు
కంపెనీల నుంచి పాత కార్లు కొనేవారిపై GST భారం పడనుంది. పాత ఎలక్ట్రానిక్‌తో పాటు పెట్రోల్, డీజిల్ కార్లపై GSTని 18శాతానికి పెంచుతున్నట్లు FM నిర్మలా సీతారామన్ తెలిపారు. గతంలో ఈవీలపై 5%, పెట్రోల్, డీజిల్ వాహనాలపై 12% GST ఉండేది. అయితే వ్యక్తుల మధ్య ఈవీల క్రయవిక్రయాలు జరిగితే జీఎస్టీ ఉండదని ఆమె చెప్పారు. మరోవైపు స్విగ్గీ, జొమాటో డెలివరీ ఛార్జీలపై GST తగ్గింపుపై నిర్ణయం తీసుకోలేదన్నారు.
News December 21, 2024
వైభవ్ సూర్యవంశీ మరో ఘనత
బిహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరో ఘనత సాధించారు. లిస్ట్-ఏ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ (13 yrs 269 days)నిలిచారు. ఇవాళ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో ఆయన లిస్ట్-ఏ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఈ రికార్డు అలీ అక్బర్ (14 yrs 51 days) ఉండేది. కాగా ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడైన పిన్న వయస్కుడిగానూ వైభవ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
News December 21, 2024
వివాదం కోరుకోవడం లేదంటూనే బన్నీ విమర్శలు
ప్రభుత్వంతో వివాదం కోరుకోవడం లేదంటూనే TG CMకు బన్నీ కౌంటర్ ఇచ్చారు. పర్మిషన్ లేకున్నా రోడ్ షో చేశారని అసెంబ్లీలో రేవంత్ అంటే, రావద్దని పోలీసులు అప్పుడే చెబితే వెనక్కి వెళ్లేవాన్నని బన్నీ చెప్పారు. ఇక అది రోడ్ షో కాదని, కార్‌పై నుంచి చేయి ఊపానన్నారు. అటు ప్రమాదం గురించి చెప్పి, వెళ్లాలని పోలిస్ హెచ్చరించినా మళ్లీ చేతులూపుతూ వెళ్లారని CM అన్నారు. అయితే తనకు వారు ఏమీ చెప్పలేదని బన్నీ పేర్కొన్నారు.