News September 15, 2024
త్రిపురారం: మాజీ ఎంపీపీ భర్తపై కత్తితో దాడి

త్రిపురారం మాజీ ఎంపీపీ అనుముల పాండమ్మ భర్త అనుముల శ్రీనివాస్ రెడ్డిపై ఆదివారం సాయంత్రం ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. తాగిన మైకంలో ఉన్న యువకుడు ఓ విషయంలో న్యాయం చేయలేదంటూ శ్రీనివాస్ రెడ్డి పై దాడి చేయడంతో కడుపులో రెండు చోట్ల గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాదు తరలించారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 9, 2025
NLG: చేతిలో పైసల్లేవ్.. కష్టంగా కుటుంబ పోషణ!

నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న తమకు వేతనాలు సకాలంలో అందడం లేదని కాంట్రాక్టు ఉద్యోగులు తెలిపారు. ఏజెన్సీల మధ్య ఉద్యోగులు నలిగిపోతున్నామన్నారు. 7 నెలలుగా జీతాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. ఆస్పత్రి అధికారులు కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతున్నారన్నారు. జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. చేతిలో పైసల్లేకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందన్నారు.
News November 9, 2025
NLG: ఇటు పంట నష్టం… అటు ఆర్థిక భారం!

జిల్లాలో కూలీల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. పత్తి సేకరణకు కూలీలు దొరకడం లేదు. వరి కోతలు, పత్తి ఏరడం ఏకకాలంలో మొదలయ్యాయి. దీంతో కూలీలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇటీవల మొంథా తుఫాన్ కారణంగా వరి చేలు నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో నేలకొరిగిన వరి మొలకెత్తాయి. ఉన్న పంటను కోయడానికి కూలీలు, వరి కోత మిషన్లు దొరికినా వరి కోయడానికి అధిక సమయం పడుతుండటంతో ఆర్థిక భారంతో రైతులు సతమతమవుతున్నారు.
News November 9, 2025
NLG: కూరగాయలు కొనేటట్లు లేదు..!

నల్గొండ జిల్లాలో కూరగాయల ధరలు పైపైకి పోతున్నాయి. నెల రోజుల నుంచి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నెల క్రితం ఏ కూరగాయలను తీసుకున్నా కేజీ రూ.20 నుంచి రూ.30 వరకే ఉండేవి. అలాంటిది ఒకేసారి కార్తీకమాసంలో రూ.60 నుంచి రూ.160 వరకు ఎగబాకాయి. ప్రతీరోజూ కూరల్లో వాడే టమోటాలు కేజీ రూ.40కు ఎగబాకింది. ఎన్నడూ లేనట్టుగా కేజీ బీన్స్ రూ.160 వరకు ఉంది. మునగ కాయలు భారీ ధర పలుకుతున్నాయి.


