News September 15, 2024

SEP 17ని విమోచన దినోత్సవంగా నిర్వహించండి: బండి

image

TG: సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా కాకుండా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. కేంద్రం కూడా అదే పేరుతో నిర్వహిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వాలు విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారి చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. అప్పటి రజాకర్లే దళమే..ప్రస్తుతం MIM పార్టీగా అవతరించిందన్నారు.

Similar News

News February 19, 2026

యూట్యూబర్ అన్వేష్‌‌కు బిగ్ షాక్!

image

తెలుగు యూట్యూబర్ అన్వేష్‌‌కు బిగ్ షాక్ తగిలింది. అతడి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాలో చెక్ చేస్తే జీరోగా కనిపిస్తోంది. ఫీడ్ కూడా మాయం అయింది. కాగా హిందూ దేవుళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు అతడిపై కేసు నమోదైంది. అన్వేష్ ఇన్‌స్టాను బ్లాక్ చేయాలని హైదరాబాద్ CCS పోలీసులు మెటా కంపెనీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

News February 19, 2026

పాక్‌లో పేలుడు.. 16 మంది మృతి

image

పాకిస్థాన్‌ కరాచీలోని ఓ మూడంతస్తుల బిల్డింగ్‌లో భారీ పేలుడు సంభవించింది. దీంతో భవనం మొత్తం కూలిపోవడంతో ఇప్పటివరకు 16 మంది మరణించారని, మరో 13 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ వల్లే పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత అసలు కారణం తెలుస్తుందని పేర్కొన్నారు. కాగా కరాచీలో గతేడాది కూడా ఐదంతస్తుల భవనం కూలడంతో 27 మంది మరణించారు.

News February 19, 2026

తిన్న వెంటనే వాటర్ తాగొచ్చా?

image

భోజనం అయిన వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. అలా చేస్తే ఎంజైమ్‌లు, జీర్ణరసాలు పలుచబడి డైజెషన్ మందగిస్తుంది. ఫలితంగా బాడీ పోషకాలను సరిగా గ్రహించుకోలేదు. అలాగే ఇన్సులిన్ లెవెల్స్‌ పెరిగి కొవ్వు పేరుకుపోతుంది. మెరుగైన జీర్ణక్రియ కోసం తినడానికి 10 నిమిషాల ముందు లేదా తిన్న అరగంట తర్వాత నీళ్లు తాగడం బెటర్. అవసరమైతే భోజనం మధ్యలో చిన్న సిప్స్ తాగొచ్చు.