News September 15, 2024

నెల్లూరు: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి

image

వినాయక నిమజ్జనం కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గూడూరు మండలం చెన్నూరు గిరిజన కాలనీ వాసులు వినాయక విగ్రహాన్ని తూపిలిపాళెం సముద్రంలో నిమర్జనం చేసి తిరిగివస్తుండగా, వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ చిల్లకూరు మండలం కడివేడు సమీపంలో అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు కాగా, క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Similar News

News October 27, 2025

నెల్లూరు జిల్లాకు రెడ్ అలెర్ట్

image

నెల్లూరు జిల్లాలో చెదురు మొదరు చినుకులుగా ప్రారంభమై భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ‘గంటకు 45–55 కి.మీ వేగంతో వీచే గాలులు, కొన్ని చోట్ల 65 కి.మీ వరకు వేగం చేరే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, యానం, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల గాలివానలు సంభవించవచ్చు’ అని పేర్కొంది.

News October 27, 2025

నెల్లూరు: డివిజన్లవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే.!

image

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను నేపథ్యంలో జిల్లా కలెక్టరు కార్యాలయంతోపాటు అన్ని రెవెన్యూ డివిజన్ల వారీగా కంట్రోల్ రూమ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు.
*జిల్లా కలెక్టరేట్ కంట్రోలు రూం నెంబర్లు: 0861 2331261, 7995576699
*కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం, : 7601002776
*ఆర్డీవో కార్యాలయం, నెల్లూరు : 9849904061
*ఆర్డీవో కార్యాలయం, ఆత్మకూరు : 9100948215
*ఆర్డీవో కార్యాలయం, కావలి : 7702267559.

News October 27, 2025

నెల్లూరు SP కార్యాలయం నుంచి కీలక అప్డేట్.!

image

ప్రతి సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమన్ని సోమవారం రద్దు చేస్తున్నట్లు నెల్లూరు SP అజిత తెలిపారు. మోంతా తుఫాన్ కారణంగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బాదితులు ఎవ్వరూ జిల్లా కేంద్రానికి రావొద్దని అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.