News September 16, 2024

మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సురేఖ

image

పవిత్ర హృదయంతో కూడిన ప్రతి మనిషికి ఈ భూమి యావత్తు ప్రార్థనాస్థలమేనన్న మహమ్మద్ ప్రవక్త మాటలు స్ఫూర్తిదాయకమైనవని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవమైన మిలాద్ ఉన్ నబీ పండుగ (సెప్టెంబర్ 16) ను పురస్కరించుకుని మంత్రి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయ ప్రజల పై వుండాలని మంత్రి ఆకాంక్షించారు.

Similar News

News November 26, 2024

మిల్లర్లు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు: వరంగల్ కలెక్టర్ 

image

ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు సహకరించాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో రైస్ మిల్లర్లతో ధాన్యం సేకరణ, రైస్ మిల్లులకు కస్టం మిల్లింగ్ రైస్ కేటాయింపు, అదనపు మిల్లింగ్ ఛార్జీలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మిల్లర్లు ఎవరైనా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆ మిల్లులను భవిష్యత్‌లో ఎటువంటి వ్యాపారం చేయకుండా రద్దు చేస్తామని హెచ్చరించారు.

News November 25, 2024

వరంగల్ మార్కెట్లో చిరు ధాన్యాల ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల చిరు ధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు (బిల్టీ) క్వింటాకి రూ.2,475 పలికింది. అలాగే సూక పల్లికాయ రూ.6,000 పలకగా.. పచ్చి పల్లికాయ రూ.5,570 పలికింది. తేజా రకం కొత్తమిర్చి క్వింటాకు రూ.15,021 ధర పలికింది. అయితే గత వారంతో పోలిస్తే నేడు పల్లికాయ ధరలు పెరిగాయి.

News November 25, 2024

KU డిగ్రీ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. బీఏ, బీకాం, బీబీఏ, బీఏసీ తదితర కోర్సుల మొదటి, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 26న ఉండగా వాటిని డిసెంబర్ 27కు రీ షెడ్యూల్ చేశారు. మూడో సెమిస్టర్ ఈ నెల 27న ఉండగా డిసెంబర్ 28కి మార్చారు. నవంబర్ 28న ఉండే పరీక్షను డిసెంబర్ 30న నిర్వహించనున్నట్లు కేయూ అధికారులు తెలిపారు. మిగతావి యథావిధిగా కొనసాగుతాయన్నారు.