News September 16, 2024

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి

image

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలకృష్ణ రావు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం రాత్రి శ్రీశైలం ఆలయానికి వచ్చారు. శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ ఈఓ పెద్దిరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి అమ్మవారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాలు అందించి సత్కరించారు.

Similar News

News March 10, 2026

కర్నూలు నగరపాలక సంస్థకు స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్ సిరి

image

కర్నూలు నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్‌గా జిల్లా కలెక్టర్ ఏ.సిరిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు కమిషనర్ విశ్వనాథ్‌ను నందికొట్కూరుకు, కర్నూలు ఆర్డీవోను గూడూరుకు స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. ఆదోనికి జాయింట్ కలెక్టర్, ఎమ్మిగనూరుకు స్థానిక ఆర్డీవోను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News March 10, 2026

ఇంటర్ పరీక్షలకు 526 మంది విద్యార్థులు గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 526 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. మొత్తం 20,731 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 20,205 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆయన పేర్కొన్నారు.

News March 10, 2026

కర్నూలు జిల్లా రైతులకు గుడ్ న్యూస్

image

పీఎం-కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు 22వ విడత ఆర్థిక సాయాన్ని ఈ నెల 13 న విడుదల చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటికే రెండు విడతల్లో రూ.4,000 చెల్లించగా, చివరి విడతగా మరో రూ.2,000 నేరుగా రైతుల ఖాతాల్లో (DBT ద్వారా) జమ కానున్నాయన్నారు. నిధులు సజావుగా అందాలంటే KYC ప్రక్రియను పూర్తి చేయాలి, భూ రికార్డులు ఆధార్‌తో అనుసంధానమవాలన్నారు.