News September 16, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: సెప్టెంబర్ 16, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4:52 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:04 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:11 గంటలకు
అసర్: సాయంత్రం 4:34 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:17 గంటలకు
ఇష: రాత్రి 7.29 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News July 11, 2025

పేదల కోసం పెద్దలను ఆకర్షిద్దాం: చంద్రబాబు

image

AP: పీ4(పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్ట్నర్షిప్) అమలుకు ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు మార్గదర్శకులుగా ఉండేందుకు పారిశ్రామికవేత్తలు, NIRలు వంటివారు 18,332మంది ముందుకొచ్చారు. వారిలో టాప్ 200మందిని ఈనెల 18న డిన్నర్‌లో సీఎం కలవనున్నారు. పీ4 లక్ష్యాలను వివరించి మరింత మందిని భాగస్వాములను చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని CM తెలిపారు. పేదల కోసం పెద్దలను ఆకర్షిద్దామని పేర్కొన్నారు.

News July 11, 2025

ముగిసిన తొలి రోజు ఆట.. ENG స్కోర్ ఎంతంటే?

image

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ నిలదొక్కుకుంది. మూడో సెషన్ ఆరంభంలో వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయినా రూట్ 99*, స్టోక్స్ 39* రన్స్‌తో ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 251 రన్స్ చేసింది. భారత బౌలర్లలో నితీశ్ 2, బుమ్రా, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.

News July 11, 2025

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలివే!

image

AP: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు TTD వెల్లడించింది. ప్రతిరోజూ ఉ.8-10 గంటల వరకు, రా.7-9 గంటల వరకు వాహన సేవలు నిర్వహించనున్నారు.
ముఖ్యమైన తేదీలు..
* 16-09-2025 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, * 23-09-2025 బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, * 24-09-2025 ధ్వజారోహణం, * 28-09-2025 గరుడ వాహనం, * 01-10-2025 రథోత్సవం,
* 02-10-2025 చక్రస్నానం