News September 16, 2024
షేక్ హసీనాపై 136 హత్యా కేసులు నమోదు

భారత్‌లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి తాత్కాలిక ప్రభుత్వం కేసుల మీద కేసులు పెడుతోంది. తాజాగా ఓ విద్యార్థి హత్యకు సంబంధించి ఆమెపై కేసు నమోదు చేసింది. ఇప్పటివరకూ ఆమెపై 155 కేసులు నమోదవగా, అందులో 136 హత్యా కేసులే. ఇటు హసీనా GOVTకి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో 1000 మందికి పైగా చనిపోయినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఆమెను బంగ్లాకు రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
Similar News
News September 5, 2025
పాండ్య బ్రదర్స్ మంచి మనసు

టీమ్ ఇండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య మంచి మనసు చాటుకున్నారు. తమ చిన్ననాటి కోచ్ జితేంద్ర సింగ్‌కు రూ.80 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా జితేంద్రనే ఓ మీడియాకు తెలిపారు. తన చిన్న చెల్లెలు పెళ్లి కోసం రూ.20 లక్షలు, కారు కోసం రూ.20 లక్షలు, తల్లి చికిత్స కోసం కొంత నగదు, ఇతర అవసరాల కోసం రూ.18 లక్షలు ఇలా ఇప్పటివరకు రూ.70-రూ.80 లక్షల వరకు ఇచ్చారని వెల్లడించారు.
News September 5, 2025
డేంజర్.. మీ పిల్లలు ఇలా నడుస్తున్నారా?

ఏడాది దాటాక పిల్లలు బుడిబుడి అడుగులు వేయడం మొదలు పెడతారు. ఈ క్రమంలో కాలివేళ్లపై నడుస్తారు. కానీ మూడేళ్లు దాటిన తర్వాత కూడా పిల్లలు అలాగే నడుస్తుంటే అది ఆటిజం వ్యాధికి సంకేతం కావొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆటిజం ఒక న్యూరో డెవలప్‌మెంటల్ కండిషన్. దీనివల్ల ఇంద్రియాల మధ్య సమన్వయం ఉండదు, భావ వ్యక్తీకరణలోపం ఉంటుంది. కాబట్టి చిన్నారుల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
News September 5, 2025
థైరాయిడ్ వల్ల జుట్టు ఊడుతోందా?

కొంతమందిలో థైరాయిడ్ కంట్రోల్లో ఉన్నప్పటికీ హెయిర్‌ఫాల్ అవుతుంటుంది. దీనికి విటమిన్ డి, కాల్షియం లోపం కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి చేపలు, గుడ్లు, పాల సంబంధిత ఉత్పత్తులు, నువ్వులు, డేట్స్, నట్స్ వంటి కాల్షియం రిచ్ ఫుడ్స్ డైలీ డైట్లో చేర్చుకోవాలి. విటమిన్ డి లోపం కారణంగా జుట్టు రాలుతుంటే డి విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు, సప్లిమెంట్లు తీసుకోవాలని ఎండోక్రినాలజిస్టులు సూచిస్తున్నారు.