News September 16, 2024
సెప్టెంబర్ 16: చరిత్రలో ఈరోజు

✒ 1916: ప్రముఖ గాయని MS సుబ్బలక్ష్మి జననం
✒ 1923: సింగపూర్ జాతి పిత లీ క్వాన్ యూ జననం
✒ 1959: ప్రముఖ నటి రోజా రమణి జననం
✒ 1975: నటి మీనా జననం
✒ 2012: హాస్య నటుడు సుత్తివేలు మరణం
✒ 2016: హేతువాది. పౌరహక్కుల నేత బొజ్జా తారకం మరణం
✒ 2019: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం
✒ అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం
Similar News
News January 18, 2026
ఆ 88 గంటలు.. తీవ్రతను మాటల్లో వర్ణించలేం: రాజ్‌నాథ్

గతేడాది పాక్ ఉగ్ర శిబిరాలపై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ 88 గంటలు కొనసాగిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. అప్పుడు ఎదుర్కొన్న తీవ్రతను మాటల్లో వర్ణించలేమని అన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రతి నిమిషం, నిర్ణయం చాలా కీలకమని తెలిపారు. ‘ప్రపంచంలో యుద్ధ రీతులు మారుతున్నాయి. కొత్త పద్ధతులు వస్తున్నాయి. ఇప్పుడు అవి సరిహద్దులకే పరిమితం కాదు’ అని నాగ్‌పూర్‌లో మందుగుండు సామగ్రి ప్లాంట్ ప్రారంభోత్సవంలో అన్నారు.
News January 18, 2026
‘నారీ నారీ నడుమ మురారి’ కలెక్షన్లు ఎంతంటే?

శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య కాంబినేషన్లో తెరకెక్కిన ‘నారీ నారీ నడుమ మురారి’ విడుదలైన మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.8.90 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.13.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని సినీ వర్గాలు తెలిపాయి. సంక్రాంతికి ఆఖరి సినిమాగా విడుదలై హిట్ టాక్ వచ్చినా థియేటర్ల కొరత ఉండటం కలెక్షన్లపై ప్రభావం చూపిస్తోంది. రేపటి నుంచి థియేటర్లు పెరిగే అవకాశం ఉందని సమాచారం. మీరు ఈ మూవీ చూశారా?
News January 18, 2026
జమ్మూకశ్మీర్‌లో కాల్పులు.. ఏడుగురు సైనికులకు గాయాలు

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు సైనికులు గాయపడినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఛత్రూ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించామని చెప్పాయి. ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నాయి.


