News September 16, 2024
3 దేశాల్లో టైఫూన్ యాగి విధ్వంసం.. భారత్ ఆపన్న హస్తం

మయన్మార్, లావోస్, వియత్నాంలలో టైఫూన్ ‘యాగి’ విధ్వంసం సృష్టిస్తోంది. దీంతో ఆయా దేశాలను ఆదుకునేందుకు భారత్ ‘సద్భవ్’ పేరిట సహాయక ఆపరేషన్ చేపట్టింది. యుద్ధ నౌక INS సాత్పురాలో 10 టన్నుల నిత్యావసరాలను మయన్మార్‌కు పంపింది. వియత్నాంకు 35 టన్నులు, లావోస్‌కు 10 టన్నుల సామగ్రిని పంపించింది. వీటిలో దుస్తులు, రేషన్, సోలార్ లాంతర్లు, దోమ తెరలు తదితర వస్తువులు ఉన్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.
Similar News
News January 13, 2026
మేడారం మహాజాతర.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి

TG: మేడారం భక్తుల కోసం ‘MyMedaram’ పేరిట వాట్సాప్ సేవలను మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి ప్రారంభించారు. 7658912300 నంబర్‌కు మెసేజ్ చేస్తే రూట్ మ్యాప్‌లు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, ట్రాఫిక్ వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చని తెలిపారు. తప్పిపోయిన వారి సమాచారం, ఫిర్యాదులు వంటి వివరాలు ఇందులో లభిస్తాయి. ఈ సేవలు వెబ్‌సైట్, మొబైల్ యాప్‌తో పాటు వాట్సాప్‌లోనూ అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
News January 13, 2026
కిటికీకి ఎదురుగా మరో కిటికీ ఉండవచ్చా?

నివాస గృహాలలో ఓ కిటికీకి ఎదురుగా మరో కిటికీ ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఆరోగ్యం, ప్రశాంతత సొంతమవుతాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘ఈ నిర్మాణం గాలి ప్రవాహాన్ని మెరుగుపరచి, గదుల ఉష్ణోగ్రత క్రమబద్ధంగా ఉంచుతుంది. సరైన వెలుతురు ప్రసరిస్తుంది. తద్వారా దైవకళతో ఉట్టిపడుతుంది. ఇది పని పట్ల ఏకాగ్రతను పెంచుతుంది. శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 13, 2026
చైనా మాంజాపై పోలీసు కమిషనర్‌కు HRC నోటీసులు

TG: గాలిపటాలు ఎగురవేసేందుకు వినియోగిస్తున్న చైనా మాంజా కారణంగా పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. తీవ్రంగా గాయపడి కొన్నిచోట్ల పిల్లల ప్రాణాలూ పోతున్నాయి. దీనిపై దాఖలైన ఫిర్యాదుతో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) సీరియస్‌గా స్పందించింది. HYD పోలీసు కమిషనర్ సజ్జనార్‌కు నోటీసులు జారీచేసింది. ఈ ఘటనలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అడ్వకేట్ రామారావు ఇమ్మానేని HRCలో ఈ పిటిషన్ దాఖలు చేశారు.


