News September 16, 2024
వేమన నీతి పద్యం- తాత్పర్యం

ఇచ్చువాని యొద్ద నీయని వాడున్న
జచ్చుగాని యీవి సాగనీడు
కల్పతరువు క్రింద గచ్చ పొదున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: కోరికలు తీర్చే కల్పవృక్షం క్రింద ముళ్లపొద ఉంటే ఆ వృక్ష సమీపానికి మనుషులను రానివ్వదు. అలాగే ధర్మాత్ముని వద్ద పిసినారి బంట్రోతు ఉంటే యజమానిని మంచి పనులు చేయకుండా అడ్డుకుంటాడు. అతనికి కీర్తి తీసుకురానివ్వడు.
Similar News
News September 5, 2025
డేంజర్.. మీ పిల్లలు ఇలా నడుస్తున్నారా?

ఏడాది దాటాక పిల్లలు బుడిబుడి అడుగులు వేయడం మొదలు పెడతారు. ఈ క్రమంలో కాలివేళ్లపై నడుస్తారు. కానీ మూడేళ్లు దాటిన తర్వాత కూడా పిల్లలు అలాగే నడుస్తుంటే అది ఆటిజం వ్యాధికి సంకేతం కావొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆటిజం ఒక న్యూరో డెవలప్మెంటల్ కండిషన్. దీనివల్ల ఇంద్రియాల మధ్య సమన్వయం ఉండదు, భావ వ్యక్తీకరణలోపం ఉంటుంది. కాబట్టి చిన్నారుల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
News September 5, 2025
థైరాయిడ్ వల్ల జుట్టు ఊడుతోందా?

కొంతమందిలో థైరాయిడ్ కంట్రోల్లో ఉన్నప్పటికీ హెయిర్ఫాల్ అవుతుంటుంది. దీనికి విటమిన్ డి, కాల్షియం లోపం కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి చేపలు, గుడ్లు, పాల సంబంధిత ఉత్పత్తులు, నువ్వులు, డేట్స్, నట్స్ వంటి కాల్షియం రిచ్ ఫుడ్స్ డైలీ డైట్లో చేర్చుకోవాలి. విటమిన్ డి లోపం కారణంగా జుట్టు రాలుతుంటే డి విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు, సప్లిమెంట్లు తీసుకోవాలని ఎండోక్రినాలజిస్టులు సూచిస్తున్నారు.
News September 5, 2025
సెకండ్ ఇన్నింగ్స్ ఇలా హిట్

చాలామంది మహిళలు వివిధ కారణాలతో ఉద్యోగంలో విరామం తీసుకుంటారు. తిరిగి ఉద్యోగంలో చేరదామంటే ఎన్నో సవాళ్లు. వీటిని ఎదుర్కొని కెరీర్లో రాణించాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. విరామానికి గల కారణాలు, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటే అవీ రెజ్యూమేలో చేర్చాలి. ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. అలాగే కొన్ని సంస్థలు విరామం తీసుకున్న మహిళల కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్స్ జరుపుతున్నాయి. వాటికి హాజరవ్వాలి.