News September 16, 2024

సీఎం అవ్వాలనే కోరిక లేదు: ఉద్ధవ్

image

అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల మద్దతు ఉంటే చాలని శివసేన(UBT) చీఫ్ ఉద్ధవ్ థాక్రే చెప్పారు. తనకు CM కావాలనే ఆకాంక్ష లేదన్నారు. 2019లోనూ CM అవ్వాలని అనుకోలేదన్నారు. బాల్ థాక్రే ఎన్నడూ పదవులు చేపట్టలేదని, ప్రజల అండదండలతో అధికారం ఆయన చేతుల్లో ఉండేదని పేర్కొన్నారు. CM అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లేందుకు MVA పక్షాలు సిద్ధమవుతున్న వేళ ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Similar News

News November 5, 2025

సిగ్నల్ జంప్ వల్లే రైలు ప్రమాదం!

image

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ రైల్వే స్టేషన్ సమీపంలో <<18197940>>రైలు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. ప్రయాణికుల రైలు బోగీ గూడ్స్ రైలు పైకి ఎక్కడం ప్రమాద తీవ్రతను పెంచింది. ప్యాసింజర్ రైలు రెడ్ సిగ్నల్ జంప్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వేబోర్డు ప్రాథమికంగా అంచనా వేసింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించింది.

News November 5, 2025

కార్తీక పౌర్ణమి ఎందుకు జరుపుతారు?

image

పరమేశ్వరుడి కీర్తిని విని ద్వేషంతో రగిలిపోయిన త్రిపురాసురుడు కైలాసంపైకి దండయాత్రకు వెళ్లాడు. మూడ్రోజుల భీకర పోరాటం తర్వాత ఈశ్వరుడు ఆ అసురుడిని సంహరించాడు. దీంతో వేయి సంవత్సరాల పాటు సాగిన అసుర పాలన అంతమైంది. దేవతల భయం కూడా తొలగిపోయింది. దీంతో అభయంకరుడైన శివుడు ఆనందోత్సాహాలతో తాండవం చేశాడు. ఈ ఘట్టం జరిగింది కార్తీక పౌర్ణమి నాడే కాబట్టి.. ప్రతి సంవత్సరం ఈ శుభదినాన శివుడిని అత్యంత భక్తితో పూజిస్తాము.

News November 5, 2025

ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలుకుతా: రొనాల్డో

image

త్వరలోనే తాను రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు పోర్చుగల్ ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఇది నిజంగానే కష్టంగా ఉంటుంది. నేను కచ్చితంగా ఏడ్చేస్తాను. 25 ఏళ్ల వయసు నుంచే నేను నా ఫ్యూచర్ ప్లాన్ రెడీ చేసుకున్నాను. నాకు వేరే ప్యాషన్స్ ఉన్నాయి. కాబట్టి పెద్దగా బోర్ కొట్టకపోవచ్చు. రిటైర్మెంట్ తర్వాత నా కోసం, నా పిల్లల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాను’ అని తెలిపారు.