News September 16, 2024

కాకినాడ: అనుమానంతో భార్యను కడతేర్చాడు

image

విశాఖపట్నం నక్కవానిపాలెంలో కాకినాడకు చెందిన సలోమి (28)ని భర్త డానియల్ అనుమానంతో హతమార్చాడని విశాఖపట్నం ఎంవీపీ పోలీస్ స్టేషన్ సీఐ మురళి ఆదివారం తెలిపారు. ఇంట్లో భార్యను గొంతు నలిమి హత్య చేసి, కొడుకుని తీసుకొని కాకినాడ వెళ్లి పోలీసులకు లొంగిపోయాడని తెలిపారు. సలోమి హోటల్లో సూపర్వైజర్‌గా పని చేస్తందని, డానియల్ చర్చిలో వీడియో గ్రాఫర్‌గా పనిచేస్తారన్నారు. సలోమి తల్లి ఫిర్యాదుపై కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News February 8, 2026

రేపు PGRS రద్దు.. కారణం ఏంటంటే?

image

ఫిబ్రవరి 9న CM చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు-కార్యదర్శుల సదస్సు ఉన్నందున, ఆరోజు జరగాల్సిన PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు రద్దు చేసినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. కలెక్టర్లు, SPలు ఈ సదస్సుకు హాజరు కావాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రజలు ఈ మార్పును గమనించాలని, తదుపరి సోమవారం నుంచి ఈ కార్యక్రమాలు యధావిధిగా జరుగుతాయని ఆమె పేర్కొన్నారు.

News February 7, 2026

పుష్కరాలకు సర్వం సిద్ధం చేయాలి: మంత్రి దుర్గేశ్

image

గోదావరి మహా పుష్కరాలు-2027 రాష్ట్ర ప్రతిష్ఠకు నిదర్శనమని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శాఖల మధ్య సమన్వయం ఉండాలని, భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.