News September 16, 2024
జీడీపీ కోసం బిగ్‌బాస్కెట్, బ్లింకిట్ డేటా!

GDPని లెక్కించేందుకు బేస్‌ఇయర్ కీలకం. 2011-12గా ఉన్న దీనిని 2023/24కు మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకే వినియోగ సరళిలో మార్పులు, ఎకనామిక్ యాక్టివిటీ వేగం తెలుసుకొనేందుకు బ్లింకిట్, బిగ్‌బాస్కెట్ వంటి యాప్స్‌లో కొనుగోళ్లను పరిశీలించనుంది. ప్రస్తుతం ఒక కుటుంబానికి అవసరమైన గ్రాసరీస్‌లో 6% వీటి ద్వారానే కొంటున్నారని అంచనా. GST డేటానూ తీసుకుంటే GDP గణాంకాలు పక్కాగా ఉంటాయని కేంద్రం భావిస్తోంది.
Similar News
News January 14, 2026
రేవంత్-CBN రహస్య ఒప్పందం కుదరదు: కాకాణి

AP: రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంజీవని వంటి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించాల్సిందేనని YCP నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. TG CM రేవంత్‌తో చేసుకున్న ఒప్పందాన్నిCBN రద్దు చేసుకోవాలన్నారు. క్లోజ్డ్‌డోర్ భేటీలో జరిగిన ఈ ఒప్పందంపై రేవంత్ మాటల్ని CBN ఖండించకపోగా ఏవేవో చెబుతూ మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు.
News January 14, 2026
ర్యాంకింగ్స్‌లో నంబర్-1 ప్లేస్‌లో ఇండియా

ICC లేటెస్ట్ ర్యాంకింగ్స్‌లో IND అదరగొట్టింది. వన్డేల్లో 122 పాయింట్లతో తొలి ప్లేస్‌లో నిలిచింది. T20ల్లో 272 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. వన్డే బ్యాటింగ్‌లో కోహ్లీ, T20ల్లో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో టెస్టుల్లో బుమ్రా, T20ల్లో వరుణ్ చక్రవర్తి ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో టెస్టుల్లో జడేజా మొదటి స్థానంలో ఉన్నారు.
News January 14, 2026
‘10 మినిట్స్ డెలివరీ’పై జెప్టో, స్విగ్గీ వెనక్కి

కేంద్రం <<18845524>>ఆదేశాలతో<<>> 10 మినిట్స్ డెలివరీ క్లెయిమ్‌ను స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో నిలిపివేశాయి. నిన్న బ్లింకిట్ ఈ ప్రకటన చేయగా తాజాగా ఈ రెండు సంస్థలూ 10 మినిట్స్ క్లెయిమ్‌ను ఆపివేస్తున్నట్లు తెలిపాయి. తమ వెబ్‌సైట్లు, యాప్‌ల నుంచి ‘10 మినిట్స్ డెలివరీ’ అనే ప్రకటనలను తొలగించాయి. కాగా గిగ్ వర్కర్ల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ హామీని ఇవ్వొద్దని కేంద్ర మంత్రి మన్సూఖ్ మాండవీయా డెలివరీ సంస్థలకు సూచించారు.


