News September 16, 2024
తెలుగు రాష్ట్రాలకు త్వరలోనే వందే మెట్రో?

దేశంలో తొలి వందే భారత్ మెట్రో రైలు(అహ్మదాబాద్-భుజ్)ను ప్రధాని మోదీ నేడు ప్రారంభిస్తారు. త్వరలోనే చెన్నై-తిరుపతి, సికింద్రాబాద్-విజయవాడ మధ్య ఈ రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. 100 నుంచి 350KM దూరమున్న నగరాల మధ్య 100KM వేగంతో నడిచేలా ఈ AC రైళ్లు రూపొందించారు. రిజర్వేషన్ ఉండదు. నేరుగా టికెట్ తీసుకుని ఎక్కాలి. 16 కోచ్‌ల రైలులో 1150 మంది కూర్చొని, 2058 మంది నిలబడి ప్రయాణించవచ్చు.
Similar News
News March 12, 2026
TODAY HEADLINES

* గల్ఫ్ పరిస్థితులపై ఆందోళన చెందొద్దు: ప్రధాని మోదీ
* LPG ఉత్పత్తిని 25% పెంచాం: కేంద్రం
* ఎక్కడా గ్యాస్ కొరత లేదు: CM చంద్రబాబు
* క్రెడిట్ చోరీ చేస్తున్న చంద్రబాబు: జగన్
* ఖమ్మం భూదాన్ భూములను పేదలకే వాడతాం: భట్టి
* తెలంగాణలో మూడో డిస్కం
* లోక్‌సభ స్పీకర్‌పై వీగిన అవిశ్వాసం
* గుజరాత్‌కు వస్తున్న నౌకపై ఇరాన్ దాడి.. ఖండించిన భారత్
* IPL తొలి దశ షెడ్యూల్ రిలీజ్
News March 12, 2026
పిల్లల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్

13ఏళ్లలోపు పిల్లలకు యాడ్స్ లేకుండా కేవలం ఫోన్స్, మెసేజెస్‌కే యాక్సెస్ ఉండేలా పేరెంట్ లింక్డ్ అకౌంట్ ఫీచర్‌ను వాట్సాప్ లాంచ్ చేసింది. ఈ అకౌంట్ సెటప్ చేసేటప్పుడు QR కోడ్ స్కాన్ చేసి పిల్లల ఫోన్‌తో పేరెంట్స్ అకౌంట్ లింకప్ చేసుకోవాలి. వాళ్లు కాంటాక్ట్స్‌ను యాడ్/బ్లాక్/రిపోర్ట్ చేసినా పేరెంట్స్‌కు నోటిఫై అవుతుంది. 6 డిజిట్ పిన్‌తో పిల్లల అకౌంట్ సెట్టింగ్స్ మార్చే యాక్సెస్ పేరెంట్స్‌కు కల్పించింది.
News March 12, 2026
ఇరాన్ దాడిని ఖండించిన భారత్

గుజరాత్‌కు వస్తున్న థాయిలాండ్ కార్గో షిప్ ‘మయూరీ నారీ’పై ఇరాన్ దాడి చేయడాన్ని భారత్ ఖండించింది. వాణిజ్య నౌకలను టార్గెట్ చేయడాన్ని తప్పుపట్టింది. ఈ దాడులు ప్రారంభమైన తొలి దశలోనే భారతీయులు సహా ఎంతో మంది ప్రాణాలు పోయాయని.. వీటి తీవ్రత మరింత పెరిగేలా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా థాయ్ షిప్‌పై దాడి ఘటనలో 20 మందిని రక్షించగా.. మరో ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది.


