News September 16, 2024

హైదరాబాద్‌లో దారుణం.. నర్సింగ్ విద్యార్థినిపై హత్యాచారం?

image

TG: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్‌లో దారుణం జరిగింది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. ఆమెపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గదిలో రక్తపు మరకలు, మద్యం బాటిల్స్ పడి ఉండటంతో ఆమె మృతిపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Similar News

News November 4, 2025

సిరిసిల్ల: ‘పోషిస్తానని చెప్పి.. వెళ్లగొడుతున్నాడు’

image

రాజరాజేశ్వర జలాశయ ముంపు బాధితులైన కడుగుల రుక్కమ్మ–మల్లయ్య దంపతులు సోమవారం సిరిసిల్ల ప్రజావాణిలో ఇన్ఛార్జి కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించారు. పరిహారంగా వచ్చిన రూ. 7.50 లక్షలను తమ సొంత చెల్లెలి కొడుకు తీసుకున్నాడని, పోషిస్తానని చెప్పి ఇప్పుడు ఇంటి నుంచే వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న తమకు న్యాయం చేయాలని, తమ సొమ్ము తిరిగి ఇప్పించాలని వారు వేడుకున్నారు.

News November 4, 2025

వంటింటి చిట్కాలు

image

*మరమరాలు మెత్తబడినప్పుడు రెండు నిమిషాలు వేయిస్తే మళ్లీ కరకరలాడతాయి.
* చేపను ఒక రోజు కంటే ఎక్కువ నిల్వ చేయాలంటే ముక్కలుగా కోసి ఉప్పు, వెనిగర్ పట్టించి డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి.
* ఉసిరికాయ నిల్వ పచ్చడి నలుపెక్కకుండా ఉండాలంటే జాడీలో పెట్టిన తర్వాత మధ్యలో ఇంగువ ముక్క ఉంచండి.
* బెండకాయలు 2, 3 రోజులు తాజాగా ఉండాలంటే తొడిమలతో పాటు రెండో చివరను కూడా కోసి ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి.

News November 4, 2025

RITESలో 600 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES)లో 600 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. బీఎస్సీ, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 12వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC,ST, PWBDలకు రూ.100. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. *ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.