News September 16, 2024

ఎల్లుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ

image

AP: పౌర్ణమి సందర్భంగా ఈ నెల 18వ తేదీన విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. ఉదయం 5.55 గంటలకు కామథేను ఆలయం నుంచి కుమ్మరిపాలెం, 4 స్థంభాలు, విద్యాధరపురం, సితారా, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్‌రావునగర్, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, రథం సెంటర్ మీదుగా మహామండపం వద్ద ప్రదక్షిణ ముగుస్తుంది. ఇటీవల ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు.

Similar News

News July 11, 2025

ఆస్పత్రిలో 2 గంటలున్నా ఇన్సూరెన్స్ క్లెయిమ్!

image

ప్రస్తుతం 2 గంటలు ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకున్నా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా క్లెయిమ్ చేస్తున్నాయి. దీనిపై పాలసీ బజార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ స్పందించారు. ‘గత పదేళ్లలో వైద్య రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. గతంలో కొన్ని ఆపరేషన్లకు చాలా సమయం పట్టేది. దీంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే 24 గంటలు పెట్టేది. ఇప్పుడు నిబంధనలు మార్చడంతో 1-2 గంటలే పడుతుంది’ అని పేర్కొన్నారు.

News July 11, 2025

భారత వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్?

image

భారత వన్డే జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్‌కు గిల్ సారథ్యం వహిస్తారని రాసుకొచ్చాయి. అలాగే టీ20 వైస్ కెప్టెన్సీని కూడా అప్పగిస్తారని పేర్కొంటున్నాయి. దీనిపై ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మతో BCCI చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా గిల్ ప్రస్తుతం టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

News July 11, 2025

ఇటలీలో భారీగా ఉద్యోగాలు.. ఇండియన్స్‌కు భలే ఛాన్స్

image

2028 కల్లా విదేశీయులకు 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ఇటలీ నిర్ణయం భారతీయులకు మేలు చేయనుంది. తమ దేశంలో వృద్ధుల సంఖ్య పెరగుతుండటంతో వలసలను ప్రోత్సహించాలని ఇటలీ నిర్ణయించింది. ప్రస్తుతం ఇటలీలో 1,67,333 మంది భారతీయులు నివసిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. ఈ క్రమంలో హోటల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్, డిజిటల్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాల్లో అవకాశాలు మెండుగా ఉంటాయని అంచనా.