News September 16, 2024

పోలవరం: 8.14 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల

image

గోదావరికి వరద ఉద్ధృతి నెమ్మదిగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద ఆదివారం సాయంత్రానికి 31.57 మీటర్లకు నీటి మట్టం చేరింది. దీంతో జలవనరుల శాఖ అధికారులు ప్రాజెక్ట్ 48 గేట్ల ద్వారా 8.14 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేసినట్లు చెప్పారు. అదేవిధంగా గోదావరికి వరద తగ్గడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Similar News

News January 24, 2026

ప.గో: ‘అమ్మ.. నాన్న.. చిన్ని క్షమించు’

image

పాలకోడేరు మండలం పెన్నడ రైల్వే క్వార్టర్స్‌లో గుర్తుతెలియని వ్యక్తి(38) మృతదేహం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతదేహం వద్ద ‘అమ్మ.. నాన్న.. చిన్ని క్షమించు’ అని రాసి ఉన్న లేఖ దొరికింది. వారం రోజుల క్రితమే చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీఆర్వో సుబ్రహ్మణ్యం సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 24, 2026

ఈనెల 29న పెనుమంట్రలో ప్రత్యేక పీజీఆర్ఎస్: కలెక్టర్

image

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ నెల 29న పెనుమంట్ర ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ సదస్సును మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.