News September 16, 2024

ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడేనని డౌట్

image

డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల కేసులో మెయిన్ సస్పెక్ట్‌ను FBI అరెస్టు చేసింది. అతడి పేరు రియాన్ వెస్లీ రౌత్ (57) అని, గతంలో నిర్మాణ కూలీగా పనిచేసేవాడని, మిలిటరీ బ్యాగ్రౌండేమీ లేదని తెలిసింది. ఆయుధాలు వాడాలని, యుద్ధాల్లో పాల్గొనాలన్న ఉబలాటం ఉందని అతడి సోషల్ మీడియా అకౌంట్లను బట్టి విశ్లేషిస్తున్నారు. 2002లో గ్రీన్స్‌బొరోలోని ఓ భవంతిలోకి ఆటోమేటిక్ గన్ తీసుకెళ్లి బారికేడ్లు వేసుకున్న కేసు అతడిపై ఉంది.

Similar News

News January 7, 2026

తేనెతో చర్మానికి తేమ

image

పొడిబారే చర్మతత్వానికి తేనె ప్యాక్‌లు వాడితే బాగా తేమగా మారుతుందంటున్నారు చర్మ నిపుణులు. పచ్చిపాలకు తేనె కలిపి ముఖానికి రాసి ఆరనిచ్చి కడిగితే చర్మం తేమగా మారుతుంది. అలాగే తేనె, కలబంద, పాలు కలిపి ముఖానికి రాసి ఆరనిచ్చి కడిగితే చర్మం తేమగా మారుతుంది. చెంచా చొప్పున తేనె, కలబంద గుజ్జుకు రెండు చుక్కలు ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ముఖానికి పూత వేయాలి. 10 నిమిషాల తర్వాత కడిగితే చర్మానికి తేమ అందుతుంది.

News January 7, 2026

TDP కొనసాగి ఉంటే గతంలోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం

image

AP: వైసీపీ ప్రభుత్వం వల్ల పోలవరం ఆలస్యమైందని, టీడీపీ కొనసాగి ఉంటే గతంలోనే పూర్తయ్యేదని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ హయాంలో కనీసం డయాఫ్రమ్ వాల్‌ను కాపాడుకోలేకపోయారని విమర్శించారు. నిపుణుల సూచనలతో నిర్మిస్తున్న కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు ఈ ఫిబ్రవరి 15 కల్లా పూర్తి చేస్తున్నామన్నారు. మెయిన్ డ్యామ్‌లోని ECRF-1 కంప్లీట్ చేశామని, వచ్చే ఏడాది మార్చి నాటికి గ్యాప్-2 పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

News January 7, 2026

అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హిందీ చిత్రంగా ‘ధురంధర్’

image

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన 33 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1,222 కోట్ల వసూళ్లను సాధించింది. అటు ఇండియాలో రూ.831.40కోట్ల వసూలు చేసి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హిందీ చిత్రంగా రికార్డులకెక్కింది. USలో $20M క్రాస్ చేసి బాహుబలి-2 తర్వాత ఆ ఘనత సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. త్వరలో ‘RRR’ వసూళ్లనూ బీట్ చేయనుంది.