News September 16, 2024

బాణసంచా పేలి భవనం ధ్వంసం.. ఏడుగురికి తీవ్ర గాయాలు!

image

AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బాణసంచా పేలి ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం ధ్వంసమైంది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 3, 2026

కల్తీ పాలు, బాణసంచా పేలుడు.. పెరిగిన మృతుల సంఖ్య

image

AP: రాష్ట్రంలో తీవ్ర విషాదం నింపిన కాకినాడ(D) వేట్లపాలెం బాణసంచా పేలుడు <<19266434>>ఘటనలో<<>> మృతుల సంఖ్య 23కి చేరింది. GGHలో చికిత్స పొందుతూ లోవరాజు(38) అనే వ్యక్తి మృతి చెందారు. అటు రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 7కి చేరింది. చౌడేశ్వర్ నగర్‌కు చెందిన సూర్యారావు(81) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో 13 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

News March 3, 2026

జగన్‌ను కలిసిన భట్టి

image

AP: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను కలిశారు. తన కుమారుడి వివాహ ఆహ్వానపత్రికను అందజేసి, వేడుకకు రావాలని కోరారు. జగన్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, వధూవరులు నిండైన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఆత్మీయంగా హత్తుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాగా భట్టి దివంగత వైఎస్సార్‌ను ఎంతగానో అభిమానిస్తారు.

News March 3, 2026

APPLY NOW: SPMCILలో ఉద్యోగాలు

image

సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) 3 సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు మార్చి 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35 ఏళ్లు. నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.spmcil.com