News September 16, 2024
HYD: ఖైరతాబాద్ గణేష్ మండపం తొలగింపు షురూ!

HYD నగరంలో ఖైరతాబాద్ వినాయకుడు వద్ద నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఇప్పటికే భక్తులకు దర్శనాలు నిలిపివేసి,మండప తొలగింపు పనులు చేపట్టారు.సమయానికి పనులు అయ్యేలా చూడాలని నిర్వాహకులకు మంత్రి సూచించారు.ఖైరతాబాద్ సప్తముఖ గణనాథుడు ఈ రోజు సాయంత్రం టస్కర్ మీదకు వెల్డింగ్ పనులు చేయనుండడంతో సమయానికి పూర్తి చేసేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News January 13, 2026
HYDలో డిమాండ్..ఆ ఒక్కదానికే రూ.2500

HYDలో పెళ్లళ్లకు బ్యూటీషియన్ల డిమాండ్ పెరిగింది. మగువ మొహాన్ని మెరుపుటద్దంలా మార్చే మేకప్, మరింత అందాన్ని తెచ్చే లేటెస్ట్ మెహంది డిజైన్ల కోసం ఖర్చుకు వెనకాడటం లేదు. నెయిల్ పాలిష్ తర్వాత ఒకే వేలుకు మాత్రమే పెట్టే ఒక్క మెరుపు చుక్కకే రూ.2,500 వరకు ఖరీదు చేస్తున్నారు. మల్టీ వ్యూ డిమాండ్ అని పిలిచే ఈ మెరుపు చుక్కలో నిలబడి చూస్తే ‘వధూవరులు’ మెరుస్తూ కనిపిస్తారు.
News January 13, 2026
HYD: నేడు ఆకాశంలో అద్భుతాలు..!

నేడు HYD దద్దరిల్లనుంది. ఆకాశంలో రోజంతా అద్భుతాలు చూడొచ్చు.
☛ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 3 డేస్ కైట్& స్వీట్ ఫెస్టివల్
☛ 3డేస్ పరేడ్ గ్రౌండ్లో సా.5 నుంచి రాత్రి వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్
☛ గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్
వీటికోసం రాష్ట్ర పర్యాటకశాఖ సర్వం సిద్ధం చేసినట్లుగా వెల్లడించింది.
News January 13, 2026
HYD: స్మోకింగ్ చేయకపోయినా క్యాన్సర్

MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో బ్రెస్ట్, సర్విక్స్ క్యాన్సర్ తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఒకప్పుడు స్మోకింగ్ చేసేవారికే వచ్చే ఈ క్యాన్సర్ ఇప్పుడు తాగనివారి జీవితాలనూ కబళిస్తోంది. HYDలో మహిళల్లో, ముఖ్యంగా స్మోకింగ్ అలవాటులేనివారిలోనూ కేసులు పెరుగుతున్నాయి. గాలి కాలుష్యం, ఇరుకు కిచెన్‌లో వంట చేసేటప్పుడు వచ్చే పొగ, చెత్త దహనం, ధూళి ప్రధాన కారణాలుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.


