News September 16, 2024
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు

జపాన్‌కు చెందిన టోమికో ఇటూకా ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా రికార్డులకెక్కారు. ఆమె నేటితో 116 ఏళ్ల 116 రోజులు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆమెను కలిసి సర్టిఫికెట్‌ను అందజేసింది. టోమికో తన వందో ఏట కూడా వాకింగ్ స్టిక్ సహాయం లేకుండానే ఆషియా పుణ్యక్షేత్రం మెట్లను ఎక్కారు. 117 ఏళ్ల మరియా బ్రన్యాస్ మోరేరా చనిపోయిన తర్వాత టోమికో అత్యంత వృద్ధురాలిగా నిలిచారు.
Similar News
News January 13, 2026
HYD: హైడ్రా వారి జోలికి వెళ్లదు..!

నివాసాల జోలికి హైడ్రా వెళ్లదని మరోసారి స్పష్టం చేసింది. 2024 జులైలో హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, హైడ్రా ఏర్పాటుకు ముందు నిర్మించిన ఇళ్లను తొలగించకూడదని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఈ నిబంధన అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని పేర్కొంది. చట్టం ప్రకారం హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని పేర్కొంది. నిన్న హైడ్రా ప్రజావాణికి 76 ఫిర్యాదులు అందాయి.
News January 13, 2026
రాష్ట్రంలో రూ.3,538 కోట్లతో సోలార్ కాంప్లెక్స్

AP: తిరుపతి జిల్లాలోని MP-SEZలో వెబ్‌సోల్ సంస్థ రూ.3,538 కోట్లతో 8GW ఇంటిగ్రేటెడ్ సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. ఇందులో 4GW సోలార్ సెల్స్, 4GW సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్లు ఉంటాయి. 2 దశల్లో 120 ఎకరాల్లో అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్టు ద్వారా 2,000 మందికి ఉపాధి లభించనుంది. దీనికి అవసరమైన విద్యుత్ కోసం 300 ఎకరాల్లో 100MW క్యాప్టివ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
News January 13, 2026
డయాబెటిస్ భారం.. భారత్‌కు రెండో స్థానం

డయాబెటిస్ వల్ల అత్యధిక ఆర్థిక భారం పడుతున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. తాజా అధ్యయనం ప్రకారం ఇండియాపై డయాబెటిస్ కారణంగా 11.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక భారం పడుతోంది. ఈ జాబితాలో US 16.5 ట్రిలియన్ డాలర్లతో టాప్‌లో ఉండగా, 11 ట్రిలియన్ డాలర్లతో చైనా మూడో స్థానంలో ఉంది. వైద్య ఖర్చులు పెరగడం ప్రజల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


