News September 16, 2024
పల్నాడు: ‘ఆక్రమణల తొలగింపుకు కూటమి ప్రభుత్వం చర్యలు’

ఆక్రమణలు తొలగింపుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడం హర్షణీయమని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కోకన్వీనర్ పెంటేల బాలాజీ చెప్పారు. సోమవారం చిలకలూరిపేట జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలలో వైసీపీ విచ్చలవిడిగా చెరువులు కాలవలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిందన్నారు. ఆక్రమణల వలన జరిగే నష్టానికి ప్రస్తుత వరదలు ఉదాహరణ అని చెప్పారు. వెంటనే ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టాలని కోరారు.
Similar News
News September 15, 2025
పులిపాటి వెంకటేశ్వర్లు మన తెనాలి వారే

తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు పులిపాటి వెంకటేశ్వర్లు గుంటూరు జిల్లా తెనాలిలో 1890 సెప్టెంబర్ 15న జన్మించారు. పద్య నాటకం పట్ల అభిమానం ఏర్పరుచుకున్న పులిపాటి తెనాలి రామ విలాస సభలో సభ్యుడిగా చేరారు. నాటకాలలో అర్జునుడు, నక్షత్రకుడు, భవానీ శంకరుడు, సుబుద్ధి, తదితర పాత్రలను పోషించడమే కాక,1932లో సినిమా రంగంలో ప్రవేశించి చింతామణి, హరిశ్చంద్ర తదితర 12 సినిమాల్లో నటించారు.
News September 15, 2025
తొలి తెలుగు కథానాయకుడు, తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన నటుడు

తెలుగు సినిమా కథానాయకుడు, సుప్రసిద్ధ రంగస్థల నటుడు వల్లూరి వెంకట సుబ్బారావు గుంటూరు జిల్లా మునిపల్లె గ్రామంలో జన్మించడం వలన మునిపల్లె సుబ్బయ్య గుర్తింపు పొందారు. ఈయన వెంకటగిరి రాజా వారిచే “నటశేఖర” బిరుదు పొందారు. సెప్టెంబర్ 15 1931లో తొలి టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద”లో హిరణ్యకశపునిగా నటించి చరిత్ర సృష్టించారు. ఈయన తొలి తెలుగు కథానాయకుడే కాక, తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసి చరిత్రలో నిలిచిపోయారు.
News September 15, 2025
జనసేన పార్టీని వైసీపీ టార్గెట్ చేస్తోంది: మంత్రి నాదెండ్ల

కులాల మధ్య చిచ్చు పెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వైసీపీ కుట్రలు చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజలు వీటిని గమనించాలని తెనాలిలో జరిగిన మీడియా సమావేశంలో కోరారు. సోషల్ మీడియాను ఉపయోగించి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఓట్ల కోసం రాజకీయాలు చేసే పార్టీ వైసీపీ అని మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు.