News September 16, 2024
గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై సీఎం సమీక్ష

TG: హైదరాబాద్‌లో నిమజ్జన ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పోలీసు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ట్యాంక్ బండ్‌తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సీఎం సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి పెట్టాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు నిమజ్జన ప్రక్రియను 733 సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 10, 2026
సపోటాలో చెక్క తెగులు – నివారణకు సూచనలు

చెక్క తెగులు ఆశించిన సపోటా చెట్ల కొమ్మలు వంకరులు తిరిగిపోతాయి. ఆకులు రాలిపోయి.. కొమ్మలు ఎండిపోయిన చెక్కలుగా మారతాయి. ఈ తెగులును గుర్తించిన వెంటనే కొమ్మలను కత్తిరించి లీటరు నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్‌ను కలిపి పిచికారీ చేసుకోవాలి. మొక్కల్లో ఇనుప ధాతు లోపం లేకుండా ఉండేందుకు 2గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 1గ్రాము నిమ్మ ఉప్పును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
News February 10, 2026
ESIC మోడల్& సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

కేరళ, కొల్లాంలోని <
News February 10, 2026
ఇంట్లో ఉండకూడని వస్తువులివే..

ఇంట్లో సానుకూల శక్తి పెరగాలంటే కొన్ని వస్తువులను తొలగించాలి. పగిలిన అద్దాలు, పనిచేయని గడియారాలు ఉంచకూడదు. ఇవి ప్రగతిని అడ్డుకుంటాయి. విరిగిన సామాన్లు, చిరిగిన పాత బట్టలు దారిద్ర్యానికి సంకేతాలు. వాడిపోయిన మొక్కలు, ఎండిపోయిన పూలు ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయి. యుద్ధం, ఏడుపు, హింసను ప్రతిబింబించే చిత్రాలు గోడలపై ఉండకూడదు. తుప్పు పట్టిన ఇనుప వస్తువులు తొలగించాలి. ఇంటిని శుభ్రంగా, వెలుతురుతో ఉంచాలి.


