News September 16, 2024
NZB: గణేష్ నిమజ్జనం.. వైన్స్, బార్లు బంద్

గణేశ్ నిమజ్జనం, శోభాయాత్రకు నిజామాబాద్ జిల్లాలో సర్వం సిద్ధం చేశారు అధికారులు. గణేశ్ నిమజ్జనం దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సీపీ కల్మేశ్వర్ ఆదేశించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకు మద్యం అమ్మరాదని తేల్చి చెప్పారు. అలాగే బార్లు, క్లబ్‌లు మూసేయాలని ఆదేశించారు.
Similar News
News January 24, 2026
NZB: ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను పరామర్శించిన కలెక్టర్

నిజామాబాద్ శివారులో తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంగా గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ జి.సౌమ్యను కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సౌమ్య కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.
News January 24, 2026
NZB: 158 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు: CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 158 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 158 మందిని కోర్టుల్లో హాజరు పరచగా రూ.14,50,000 జరిమానా విధించడం జరిగిందన్నారు. అలాగే 13 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారని CP వివరించారు.
News January 24, 2026
NZB: నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కమిషనర్

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ శనివారం పరిశీలించారు. సౌకర్యాలు ఎలా ఉన్నాయో గమనించి సంబంధిత సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లను వెంటనే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా నగరంలో 3 డివిజన్‌లకు ఒకటి చొప్పున 20 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.


