News September 16, 2024

అలాంటి వ్యాఖ్యలకు న్యాయవ్యవస్థ దూరంగా ఉండాలి: ఉప‌రాష్ట్ర‌ప‌తి

image

ప్రభుత్వ సంస్థలను నిరుత్సాహపరచ‌డ‌మే కాకుండా రాజకీయ చర్చను రేకెత్తించే ఎలాంటి వ్యాఖ్యానాల‌కైనా న్యాయ‌వ్య‌వ‌స్థ దూరంగా ఉండాల‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి జగదీప్ ధన్‌ఖడ్ సూచించారు. చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన ప‌నితీరును అనుస‌రించే బ‌ల‌మైన‌, స్వ‌తంత్ర సంస్థ‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు. CBI పంజ‌రంలో చిల‌క‌ అనే భావన లేకుండా ఉండాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ధ‌న్‌ఖ‌ఢ్ సూచ‌న‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

Similar News

News February 5, 2026

మేళ్లచెర్వు జాతరకు రూ.కోటి మంజూరు

image

ప్రముఖ పుణ్యక్షేత్రమైన మేళ్లచెరువు స్వయంభూ శంభులింగేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి మంత్రి ఉత్తమ్ రూ.1 కోటి నిధులను మంజూరు చేశారు. రాబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, భక్తులకు అవసరమైన వసతుల కల్పన కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు. ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిన మంత్రికి ఆలయ సిబ్బంది, గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ జాతర ఈ నెల 15 నుంచి జరగనుంది.

News February 5, 2026

AI ఎఫెక్ట్.. ఉద్యోగం కోల్పోయిన శశిథరూర్ కుమారుడు

image

అమెరికా మీడియా సంస్థ ‘వాషింగ్టన్ పోస్ట్’ తమ సిబ్బందిలో మూడింట ఒక వంతు మందిని (300+) ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇందులో కాంగ్రెస్ MP శశిథరూర్ తనయుడు ఇషాన్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన SMలో వెల్లడించారు. ‘నాతో పాటు చాలా మంది ఇంటర్నేషనల్ స్టాఫ్‌ను తొలగించారు. మా ఖాళీ న్యూస్ రూమ్‌ను, జర్నలిస్టులను చూస్తుంటే బాధగా ఉంది’ అని పేర్కొన్నారు. AI వల్ల ITతో పాటు ఇతర రంగాల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి.

News February 5, 2026

బంధంలో ఇది ముఖ్యం

image

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతోనో, నలుగురూ వేలెత్తి చూపుతారన్న భయంతోనో నిరంతరం అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్న వారవుతారు. కాబట్టి బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్‌డ్‌గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.