News September 16, 2024
దేశ ప్రజలకు పుతిన్ ‘బోల్డ్ అడ్వైస్’

పని వేళల్లో భోజన విరామం, కాఫీ బ్రేక్‌లో సెక్స్‌లో పాల్గొని దేశ జనాభా రేటు క్షీణతను పరిష్కరించాలని రష్యా ప్రజలకు దేశాధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చారు. రష్యా సంతానోత్పత్తి రేటు ప్రస్తుతం ఒక మహిళకు దాదాపు 1.5 మంది పిల్లలుగా ఉంది. స్థిరమైన జనాభాకు అవసరమైన 2.1 రేటు కంటే తక్కువగా ఉంది. ఉక్రెయిన్‌తో యుద్ధం వల్ల 10 లక్షలకుపైగా యువకులు దేశాన్ని వీడారు. దీంతో పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Similar News
News January 9, 2026
ఎయిర్ ప్యూరిఫయర్లపై GST తగ్గిస్తారా? కేంద్రం సమాధానమిదే

ఎయిర్ ప్యూరిఫయర్లపై GST తగ్గించాలన్న ఢిల్లీ HC సూచనలపై కేంద్రం స్పందించింది. GST కౌన్సిల్ సమావేశం కాకుండా పన్ను రేట్లను తగ్గించలేమని తెలిపింది. ఢిల్లీ లాంటి నగరాల్లో గాలి నాణ్యత తగ్గడంతో ఎయిర్ ప్యూరిఫయర్లపై GSTని తగ్గించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం వాటిపై 18% పన్ను ఉంది. కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 279A ప్రకారం GST రేట్లను నిర్ణయించే అధికారం కౌన్సిల్‌కు మాత్రమే ఉందని కేంద్రం పేర్కొంది.
News January 9, 2026
తక్కువ పంట కాలం.. బీర సాగుతో మంచి ఆదాయం

సీజన్‌తో పనిలేకుండా ఏడాది పొడవునా పండే కూరగాయల్లో బీర ముఖ్యమైంది. ఇది తక్కువ సమయంలోనే చేతికి వస్తుంది. బీరకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పందిరి విధానంలో బీర సాగు చేస్తూ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. బీర పంటకు ఎండాకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. బీరను క్షార, ఆమ్ల లక్షణాలు ఉన్న నేలల్లో తప్ప మిగిలిన అన్ని రకాల నేలల్లో సాగుచేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
News January 9, 2026
9వేల ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్!

తెలంగాణలోని 9,937 ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్ సరఫరా వ్యవస్థలను సర్కార్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం ₹290Cr వ్యయంతో టెండర్లను ఆహ్వానించారు. రాష్ట్ర ఇంధన&పునరుత్పాదక ఇంధన విభాగాలు వచ్చే నెల నాటికి టెండర్లను ఖరారు చేయనున్నాయి. స్కూళ్లలో సౌర విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసే బాధ్యతను ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీకి అప్పగించారు.


