News September 16, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు మోస్తరు వర్షం కురవనున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

Similar News

News September 8, 2025

ఆస్ట్రేలియాలో ఈ వస్తువులకు నో ఎంట్రీ

image

మల్లెపూలు తీసుకెళ్లినందుకు నటి <<17646725>>నవ్య నాయర్‌<<>>కు ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టు అధికారులు ఫైన్ విధించారు. అక్కడికి పువ్వులు, పండ్లు, కూరగాయలు, విత్తనాలు, ముడి గింజలు, పాల ఉత్పత్తులు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, రసగుల్లా, మైసూర్ పాక్, గులాబ్ జామూన్, రస్ మలై, బియ్యం, టీ, తేనె, హోమ్ ఫుడ్, పెట్స్ ఫుడ్, పక్షులు, పక్షుల ఈకలు, ఎముకలు, బ్యాగులు, దుప్పట్లు, మేపుల్ సిరప్ తీసుకెళ్తే రూ.1,54,316 వరకు ఫైన్ విధిస్తారు.

News September 8, 2025

హిందీ తప్పనిసరని ఎక్కడా చెప్పలేదు: లోకేశ్

image

AP: కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం(NEP)లో హిందీ తప్పనిసరి అని ఎక్కడా చెప్పలేదని మంత్రి లోకేశ్ అన్నారు. ఈ విధానంలో మూడు భాషలు నేర్చుకోవాలని మాత్రమే చెప్పిందన్నారు. తానూ 3 భాషలు నేర్చుకున్నట్లు ఇండియా టుడే సదస్సులో చెప్పారు. చదువుపై రాజకీయాల ప్రభావం పడకూడదని అభిప్రాయపడ్డారు. నేటి తరం పిల్లలు ఐదేసి భాషలు నేర్చుకుంటున్నారని, ఎక్కువ భాషలతో విదేశాల్లో పనిచేసేందుకు వీలుంటుందన్నారు.

News September 8, 2025

పాల సరఫరా తగ్గడంపై మంత్రి సీతక్క ఆగ్రహం

image

TG: అంగన్‌వాడీలకు పాల సరఫరా తగ్గడంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై రివ్యూ నిర్వహించిన ఆమెకు గతనెల 58% మాత్రమే పాలు సరఫరా అయ్యాయని అధికారులు తెలిపారు. దీంతో మరోసారి రిపీట్ కావొద్దని, పాలతో పాటు గుడ్లు, పప్పు, ఇతర ఆహార పదార్థాలు సక్రమంగా వచ్చేలా చూడాలని ఆదేశించారు. ప్రతి 10 రోజులకోసారి ఏజెన్సీలు గుడ్లు సరఫరా చేయాలని, లేదంటే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరించారు.