News September 17, 2024
కొనసాగుతున్న సీఎంల రాజీనామా ఒరవడి

ప్రభుత్వంలో కుమ్ములాటలు, MLAల ఫిరాయింపులు, కోర్టు కేసుల వల్ల ఇటీవల పదవిలో ఉన్న CMలు రాజీనామాలు చేస్తున్న ఒరవడి కొనసాగుతోంది. గతంలో MHలో ఉద్ధవ్ ఠాక్రే, MPలో కమలనాథ్, ఝార్ఖండ్‌లో హేమంత్ సోరెన్, హరియాణలో మనోహర్ లాల్, KAలో యడియూరప్ప, గుజరాత్‌లో విజయ్ రూపాని, ఉత్తరాఖండ్‌లో త్రివేంద్ర సింగ్ పదవిలో ఉండగా రాజీనామా చేశారు. తాజాగా ఢిల్లీ CM కేజ్రీవాల్ ఈ జాబితాలో చేరనున్నారు.
Similar News
News September 8, 2025
జైల్లో లైబ్రరీ క్లర్క్‌గా ప్రజ్వల్ రేవణ్ణ

పనిమనిషిపై అత్యాచారం కేసులో హాసన్ (కర్ణాటక) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు యావజ్జీవ శిక్ష పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరప్పన ఆగ్రహార జైలులో ఉన్న ఆయనకు అధికారులు లైబ్రరీ క్లర్క్ పనిని కేటాయించారు. ఖైదీలకు పుస్తకాలు ఇవ్వడం, వాటి వివరాలు నమోదు చేయడమే పని. రోజుకు ₹522 జీతంగా ఇస్తారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న వారు నెలకు కనీసం 12, వారానికి 3 రోజులు పని చేయాలనే నిబంధన ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
News September 8, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 8, 2025
సెప్టెంబర్ 8: చరిత్రలో ఈ రోజు

✶ 1910: సినీ దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ జననం
✶ 1933: గాయని ఆశా భోస్లే జననం (ఫొటోలో లెఫ్ట్)
✶ 1936: సంగీత దర్శకుడు చక్రవర్తి జననం (ఫొటోలో రైట్)
✶ 1951: డైరెక్టర్ మాధవపెద్ది సురేశ్ జననం
✶ 1986: బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ జననం
✶1999: క్రికెటర్ శుభ్‌మన్ గిల్ జననం
✶ 2020: నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణం
✶ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
✶ ప్రపంచ శారీరక చికిత్స (ఫిజియోథెరపీ) దినోత్సవం